నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్

India vs England: ఇప్పటికే 2-1తో భారత్ ఆధిక్యం, ఐదో టెస్ట్ గెలిస్తే సిరీస్‌ టీమిండియాదే

Jyothi
Published on: 1 July 2022 7:45 AM IST
India and England Fifth Test From Today
X

నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్ట్

India vs England: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. గతేడాది నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉంది. కరోనా కారణంగా నాడు అర్థాంతరంగా వాయిదా పడడంతో, మిగిలిన మ్యాచ్ ఇవాళ్టి నుంచి జరగనుంది. ఇంతకుముందు ఆడిన మూడింటిలో భారత్ రెండు మ్యాచుల్లో గెలవగా, ఇంగ్లండ్ ఒక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్‌ను సమం చేయవచ్చు.

భారత్ గెలిస్తే సిరీస్ తన వశం అవుతుంది. ఇక ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత్‌ - ఇంగ్లాండ్‌ మధ్య ఐదో టెస్టు మధ్యాహ్నం నుంచి ఆరంభం కానుంది. ఈ కీలక పోరులోనూ ఇంగ్లీష్‌ గడ్డపై చారిత్రక విజయం నమోదు చేయాలని టీమ్​ఇండియా ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌.. చివరి టెస్టులో నెగ్గి సిరీస్‌ సమం చేయాలని పట్టుదలగా ఉంది.

Jyothi

Jyothi

Next Story