logo
క్రీడలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో తెలంగాణ బాక్సర్‌ రికార్డు.. గోల్డ్‌మెడల్‌ సాధించిన నిఖత్‌ జరీన్‌..

India boxer Nikhat Zareen beats Mcnaul of Northern Ireland to win Gold
X

కామన్వెల్త్‌ గేమ్స్‌లో తెలంగాణ బాక్సర్‌ రికార్డు.. గోల్డ్‌మెడల్‌ సాధించిన నిఖత్‌ జరీన్‌..

Highlights

CWG 2022: తెలంగాణ అమ్మాయి, మహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్‌ జరీన్ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది.

CWG 2022: బ్రిటన్‎లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు కొనసాగుతోంది. తెలంగాణ అమ్మాయి, మహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్‌ జరీన్ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో పోటీ పడిన ఆమె.. ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్‌ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా.. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. అందులో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్య పతకాలు ఉన్నాయి.


Web TitleIndia boxer Nikhat Zareen beats Mcnaul of Northern Ireland to win Gold
Next Story