IND Playing 11 vs WI: ఆ ఇద్దరు ఫ్లాప్ ఆటగాళ్లకు మరో ఛాన్స్.. వెస్టిండీస్ మ్యాచ్‌కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

IND Playing 11 vs WI: ఆ ఇద్దరు ఫ్లాప్ ఆటగాళ్లకు మరో ఛాన్స్.. వెస్టిండీస్ మ్యాచ్‌కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
x

IND Playing 11 vs WI: ఆ ఇద్దరు ఫ్లాప్ ఆటగాళ్లకు మరో ఛాన్స్.. వెస్టిండీస్ మ్యాచ్‌కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

Highlights

IND Playing 11 vs WI: ఫామ్‌లో లేకపోయినా సెలెక్టర్ల విశ్వాసం.. వెస్టిండీస్‌తో కీలక పోరుకు భారత్ జట్టులో ఆసక్తికర మార్పులు!

టీ20 ప్రపంచకప్‌ 2026కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం సూపర్-8 పోరు రసవత్తరంగా సాగుతోంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీస్ చేరగా.. శ్రీలంక నిష్క్రమించింది. రెండో బెర్త్ కోసం న్యూజీలాండ్, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఇక గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా ఫైనల్ చేరగా.. జింబాంబ్వే ఇంటిదారి పట్టింది. మరో బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ టీమ్స్ పోటీలో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం (మార్చి 1) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.

సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చేసిన ప్రయోగం ఫలిచింది. ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను పంపగా.. టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. అప్పటివరకు డక్స్ పెట్టిన అభిషేక్ శర్మ.. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సంజూ కూడా ధాటిగా ఆడాడు. అందుకే వెస్టిండీస్‌పై కూడా వీరిద్దరే ఓపెనింగ్ చేయనున్నారు. అయితే సంజూ త్వరగా అవుట్ అయ్యాడు. అయినా అతడికి మరో అవకాశం దక్కనుంది. మూడో స్థానంలో ఇషాన్ కిషన్, నాలుగులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడుతారు. గత మ్యాచ్‌లో ఇబ్బంది పడ్డ సూర్య వెస్టిండీస్‌పై రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. టాప్ ఆర్డర్ రాణిస్తే.. టీమిండియాకు తిరుగుండదు.

జింబాబ్వే మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు బాగా ఆడారు. హార్దిక్ పాండ్య 23 బంతుల్లో 50 రన్స్ చేశాడు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి చెలరేగిపోయాడు. మూడో స్థానంలో పెద్దగా ఆకట్టుకోని తిలక్.. దిగువన బ్యాటింగ్ చేసి ఆకటుకున్నాడు. మరోసారి అతడు అదే స్థానంలో ఆడనున్నాడు. తండ్రి అంత్యక్రియల అనంతరం ఫినిషర్ రింకూ సింగ్ జట్టులో చేరాడు. అయినా అత డికి మరోసారి నిరాశ తప్పదు. శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే జింబాబ్వేపై భారీగా రన్స్ ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా భారీ సిక్సులు బాదే అతడు జట్టులో కొనసాగడం పక్కా. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి పంచుకొనున్నారు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ పేస్ కోటాలో ఆడుతారు. ఈడెన్ గార్డెన్స్‌ స్పిన్ పిచ్ కాబట్టి ఓ పేసర్ స్థానంలో కుల్దీప్ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి జింబాబ్వేపై నిరాశపర్చిన సంజూ, దూబేపై టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories