
ZIM vs IND: చెన్నైలో చిందేసిన భారత బ్యాటర్లు.. జింబాబ్వే ముందు ఊహించని టార్గెట్?
ZIM vs IND: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా చెన్నైలో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో భారీ స్కోర్ చేసింది.
ZIM vs IND: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా చెన్నైలో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. దాంతో జింబాబ్వే ముందు కొండంత లక్ష్యం ఉంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ బాదాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 55 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్య మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 23 బంతిలోనే ఫిఫ్టీ చేశాడు. తిలక్ వర్మ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్ (38) కీలక రన్స్ బాదాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, టినోటెండా మాపోసా, సికందర్ రాజా తలో వికెట్ తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు మెరుపు ఆరంభం ఇచ్చారు. ముఖ్యంగా సంజు మొదటి బంతి నుంచే ధాటిగా ఆడాడు. 15 బంతుల్లో 23 రన్స్ చేసి టీమ్ స్కోర్ 48 వద్ద అవుట్ అయ్యాడు. ఆపై ఇషాన్ కిషన్ క్రీజులోకి రాగా.. అభిషేక్ దంచుడు మొదలెట్టాడు. భారీ సిక్సులు, ఫోర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు ఇషాన్ కూడా వేగంగా ఆడాడు. దాంతో భారత్ స్కోర్ చూస్తుండగానే 100 దాటేసింది. 120 రన్స్ వద్ద కిషన్ అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ అనంతరం అభిషేక్ కూడా పెవిలియన్ చేరాడు. వరుస లైఫ్స్ అందుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 33 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
భారత్ 15 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 174 రన్స్ చేసింది. దాంతో 250 టార్గెట్ పెట్టుకున్న టీమిండియా.. ఆ దిశగా సాగుతుందా అని అనిపించింది. ఈ సమయంలో హార్దిక్ పాండ్య, తిలక్ వర్మలు బ్యాట్ ఝులిపించారు. ఇద్దరు సిక్సులతో డీలింగ్ చేయడంతో భారత్ స్కోర్ 200 దాటింది. ఇక చివరి మూడు ఓవర్లలో సిక్సుల వర్షం కురవడంతో భారత్ ఏకంగా 256 రన్స్ చేసింది. ఈ టోర్నీలో ఇదే టీమ్ అత్యధిక స్కోరు (256/4). ఇక టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత్ విజయం దాదాపుగా ఖాయం అయినట్లే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




