India Squad for T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా స్క్వాడ్ ప్రకటన.. కెప్టెన్‌గా సూర్య, అక్షర్‌కు వైస్ కెప్టెన్సీ.. గిల్‌కు షాక్!

India Squad for T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా స్క్వాడ్ ప్రకటన.. కెప్టెన్‌గా సూర్య, అక్షర్‌కు వైస్ కెప్టెన్సీ.. గిల్‌కు షాక్!
x

India Squad for T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా స్క్వాడ్ ప్రకటన.. కెప్టెన్‌గా సూర్య, అక్షర్‌కు వైస్ కెప్టెన్సీ.. గిల్‌కు షాక్!

Highlights

India Squad for T20 World Cup 2026: 2026లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది.

India Squad for T20 World Cup 2026: 2026లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అయితే, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

టోర్నీ షెడ్యూల్ ముఖ్యాంశాలు:

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్‌కప్ పోరు ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ పండుగ మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.

తొలి మ్యాచ్: ఫిబ్రవరి 7న అమెరికా (USA)తో భారత్ తలపడుతుంది.

రెండో మ్యాచ్: ఫిబ్రవరి 12న నమీబియాతో పోరు.

భారత్-పాక్ సమరం: ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో దాయాది పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా ఢీకొంటుంది.

నాలుగో మ్యాచ్: ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు జరుగుతాయి. అనంతరం మార్చి 4, 5 తేదీల్లో సెమీఫైనల్స్, మార్చి 8న తుది పోరు (ఫైనల్) జరుగుతుంది.

ప్రకటించిన భారత జట్టు (15 మంది సభ్యులు):

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివం దూబె, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Show Full Article
Print Article
Next Story
More Stories