India vs England Test: నేటి నుంచి ఇండియా vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్..తొలి టెస్టుపై వరుణుడి ప్రభావం

India vs England Test
x

India vs England Test: నేటి నుంచి ఇండియా vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్..తొలి టెస్టుపై వరుణుడి ప్రభావం

Highlights

India vs England Test: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేటి నుండి (జూన్ 20) లీడ్స్‌లో ప్రారంభం కానుంది. ఈ మొదటి మ్యాచ్ కోసం రెండు జట్లు కఠినంగా ప్రాక్టీస్ చేశాయి.

India vs England Test: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేటి నుండి (జూన్ 20) లీడ్స్‌లో ప్రారంభం కానుంది. ఈ మొదటి మ్యాచ్ కోసం రెండు జట్లు కఠినంగా ప్రాక్టీస్ చేశాయి. భారత బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తుంటే, ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. AccuWeather.com నివేదిక ప్రకారం, జూన్‌లో లీడ్స్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌లో ఏ రోజు వర్షం పడే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఐదు రోజుల వాతావరణ నివేదిక

మొదటి రోజు (జూన్ 20): వర్షం పడే అవకాశం 5 నుండి 10 శాతం మాత్రమే ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. అంటే, మొదటి రోజు ఆట సజావుగా సాగవచ్చు.

రెండవ రోజు (జూన్ 21): వర్షం పడే అవకాశం ఏకంగా 60 శాతం ఉంది. దీనివల్ల, ఈ రోజు ఆట ఆలస్యం కావొచ్చు లేదా పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది.

మూడవ రోజు (జూన్ 22): వర్షం పడే అవకాశం మళ్ళీ 5 నుండి 10 శాతం మాత్రమే ఉంది. అంటే, మూడవ రోజు మ్యాచ్ ఎటువంటి ఆటంకం లేకుండా జరగనుంది.

నాల్గవ రోజు (జూన్ 23): వర్షం పడే అవకాశం 25-30 శాతం ఉంది. కాబట్టి, ఈ రోజు కూడా ఆటకి వర్షం అంతరాయం కలిగించవచ్చు.

ఐదవ మరియు చివరి రోజు (జూన్ 24): చివరి రోజు కూడా 25-30 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ భారీ వర్షం పడితే, మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్ డ్రా అయితే, అది రెండు జట్ల విన్నింగ్ పర్సంటేజీ పై ప్రభావం చూపుతుంది.

హెడింగ్‌లీ మైదానంలో టీమిండియా రికార్డు అంతగా బాగుండలేదు. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది, నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరోవైపు, భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 136 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 35 మ్యాచ్‌లలో గెలిస్తే, ఇంగ్లండ్ 51 టెస్ట్ మ్యాచ్‌లలో విజయం సాధించింది. మిగిలిన 50 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే, ఈ టెస్ట్ సిరీస్ ఇరు జట్లకు సవాలుగా మారనుంది. వర్షం ఎంతవరకు ఆటను ప్రభావితం చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories