India vs New Zealand : టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఇదే చివరి సిరీస్.. న్యూజిలాండ్‌తో పోరు.. యంగ్ స్టర్లకు అగ్ని పరీక్ష

India vs New Zealand Series 2026 Final T20 Test Before World Cup
x

India vs New Zealand Series 2026 Final T20 Test Before World Cup

Highlights

భారత క్రికెట్ జట్టుకు 2025వ సంవత్సరం నిజంగా ఒక కలలా గడిచిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మార్చి నెలలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి టీమిండియా తన సత్తా చాటింది.

India vs New Zealand : భారత క్రికెట్ జట్టుకు 2025వ సంవత్సరం నిజంగా ఒక కలలా గడిచిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మార్చి నెలలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి టీమిండియా తన సత్తా చాటింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీ మాయాజాలంతో పాకిస్థాన్‌ను ఓడించి ఆసియా కప్ ట్రోఫీని కూడా మన ఖాతాలో వేసింది. ఏడాది చివర్లో సౌతాఫ్రికా మీద వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచి 2025కు ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఒక్క టెస్ట్ క్రికెట్‌లో మాత్రం మనోళ్లు కొంచెం తడబడ్డారు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ 2026లో జరగబోయే పోరాటాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

కొత్త ఏడాది 2026 జనవరిలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్ మనకు చాలా కీలకం. ఎందుకంటే ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దానికి ముందు ఇదే చివరి టీ20 సిరీస్ కాబట్టి, మన కుర్రాళ్లను పరీక్షించుకోవడానికి, జట్టును సెట్ చేసుకోవడానికి సెలెక్టర్లకు ఇది ఒక చివరి అవకాశం. ఈ పర్యటనలో మొత్తం 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్

(అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి)

జనవరి 11: మొదటి వన్డే – వేదిక: వడోదర

జనవరి 14: రెండో వన్డే – వేదిక: రాజ్‌కోట్

జనవరి 18: మూడో వన్డే – వేదిక: ఇండోర్

భారత్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

(అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతాయి)

జనవరి 21: మొదటి టీ20 – వేదిక: జమ్తా

జనవరి 23: రెండో టీ20 – వేదిక: రాయ్‌పూర్

జనవరి 25: మూడో టీ20 – వేదిక: గౌహతి

జనవరి 28: నాలుగో టీ20 – వేదిక: విశాఖపట్నం (వైజాగ్)

జనవరి 31: ఐదో టీ20 – వేదిక: తిరువనంతపురం

Show Full Article
Print Article
Next Story
More Stories