
IND vs PAK Records: సమరానికి పై.. భారత్, పాకిస్థాన్ మధ్య టీ20, ప్రపంచకప్, కొలంబో రికార్డులు ఇవే!
ముఖాముఖి పోరులో ఎవరి ఆధిక్యం? టీ20, వరల్డ్‌కప్, కొలంబో గణాంకాలు ఒకే చోట!
టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-Aలో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ పోరు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఆదివారం (ఫ్రిబ్రవరి 15) రాత్రి 7 గంటలకు మ్యాచ్ కానుంది. రెండు జట్లు ఇప్పటివరకు ప్రపంచకప్ 2026 టోర్నీలో అపజయం లేకుండా ముందుకు సాగాయి. ఈ మ్యాచ్ తర్వాత ఒక జట్టుకు తొలి ఓటమి తప్పదు. ఇండో, పాక్ టీమ్స్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ జతల మధ్య టీ20, ప్రపంచకప్, కొలంబో రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.
కొలంబో వేదికపై రికార్డులు చూస్తే భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఈ మైదానంలో భారత్ మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 11 విజయాలు సాధించింది. అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ వంటి జట్లను కూడా ఇక్కడ ఓడించింది. పాకిస్థాన్‌పై 2012లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మరోవైపు పాకిస్థాన్ ఈ వేదికపై 7 మ్యాచ్‌లు ఆడి.. 4 గెలిచి, 2 ఓడింది. కొలంబోలో గెలుపు శాతం భారత్‌ది 73.33 కాగా.. పాకిస్థాన్‌ది 57.14 మాత్రమే.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో రెండు జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడగా.. భారత్ 7 మ్యాచ్‌లు గెలిచింది. మరోవైపు పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. మొత్తంగా టీ20 అంతర్జాతీయాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య 16 మ్యాచ్‌లు జరగగా.. ఇండియా 13 గెలిచింది, పాక్ 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం టోర్నీలో అమెరికా మీద భారత్, నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ తృటిలో ఓటమి నుంచి బయటపడి గెలిచాయి. దాంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ అభిమానుల్లో మరింత పెరిగింది. గణాంకాలు ఇండియాకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ అంచనాలకు అతీతమే అన్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ స్పిన్ దళాల మధ్య పోరు. భారత జట్టులో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారు. పాకిస్థాన్ జట్టులో షాబాద్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ లాంటి స్పిన్ బౌలర్లు ఉన్నారు. కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో.. వీరందరూ మ్యాచ్ ఫలితాన్ని మార్చేయనున్నారు.
- T20 World Cup 2026
- IND vs PAK
- India vs Pakistan
- India vs Pakistan records
- IND vs PAK stats
- India vs Pakistan T20 record
- T20 World Cup India Pakistan head to head
- Colombo stadium stats India Pakistan
- IND vs PAK 2026 match preview
- India Pakistan rivalry stats
- cricket head to head India Pakistan
- India vs Pakistan Records in T20 World Cup
- India vs Pakistan Records in Colombo

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




