IND vs PAK: విరాట్ కోహ్లీ 'కింగ్' రికార్డులు.. హార్దిక్ బౌలింగ్ పదును: పాకిస్థాన్‌ను మరోసారి మట్టికరిపించేందుకు టీమిండియా రెడీ!

IND vs PAK: విరాట్ కోహ్లీ కింగ్ రికార్డులు.. హార్దిక్ బౌలింగ్ పదును: పాకిస్థాన్‌ను మరోసారి మట్టికరిపించేందుకు టీమిండియా రెడీ!
x
Highlights

IND vs PAK: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది.

IND vs PAK: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియాతో ఆడే ప్రసక్తే లేదని మొండికేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) హెచ్చరికలతో ఎట్టకేలకు మెడలు వంచింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15, ఆదివారం నాడు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా దాయాదుల సమరం జరగనుంది.

వరల్డ్ కప్‌లో భారత్‌దే పైచేయి:

గత రికార్డులను పరిశీలిస్తే టీ20 ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌పై భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది.

హెడ్-టు-హెడ్: ఇప్పటివరకు జరిగిన 9 టీ20 ప్రపంచకప్‌లలో ఇరుజట్లు 8 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్థాన్ కేవలం ఒక్కసారి (2021) మాత్రమే గెలిచింది.

ఓవరాల్ టీ20లు: మొత్తం 16 సార్లు తలపడగా భారత్ 13 మ్యాచ్‌ల్లో, పాక్ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

కీలక ఆటగాళ్లు & గణాంకాలు:

తిలక్ వర్మ: ప్రస్తుత జట్టులో పాకిస్థాన్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడు (3 ఇన్నింగ్స్‌ల్లో 130 పరుగులు).

విరాట్ కోహ్లీ: ఓవరాల్‌గా పాక్‌పై 11 మ్యాచ్‌ల్లో 492 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.

హార్దిక్ పాండ్యా: బౌలింగ్‌లో పాక్‌పై అత్యధికంగా 15 వికెట్లు పడగొట్టి టీమిండియా ఆశాకిరణంగా మారాడు.

2012లో ఇదే కొలంబో వేదికగా పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా, మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ఐసీసీ జోక్యంతో పాక్ 'యూ-టర్న్' తీసుకోవడం క్రికెట్ అభిమానులకు తీపి కబురుగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories