India vs South Africa: టీమిండియా తదుపరి సిరీస్ షెడ్యూల్.. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో మెగా టూర్

India vs South Africa
x

India vs South Africa : టీమిండియా తదుపరి సిరీస్ షెడ్యూల్.. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో మెగా టూర్

Highlights

India vs South Africa : ఆస్ట్రేలియా పర్యటనను (వన్డే సిరీస్‌లో ఓటమి, టీ20 సిరీస్‌లో విజయం) ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా ఇప్పుడు తమ తదుపరి అంతర్జాతీయ సిరీస్‌కు సిద్ధమవుతోంది.

India vs South Africa: ఆస్ట్రేలియా పర్యటనను (వన్డే సిరీస్‌లో ఓటమి, టీ20 సిరీస్‌లో విజయం) ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా ఇప్పుడు తమ తదుపరి అంతర్జాతీయ సిరీస్‌కు సిద్ధమవుతోంది. సొంత గడ్డపై సౌతాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్ల సిరీస్‌ల కోసం పర్యటించనుంది. ఈ సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడతారు. ఈ మెగా హోమ్ సిరీస్ నవంబర్ 14న టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘ సిరీస్‌లో టెస్టుల్లో శుభ్‌మన్ గిల్ జట్టుకు కెప్టెన్‎గా వ్యవహరించనుండగా, వన్డే సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడనున్నారు.

నవంబర్ 14 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం

భారత్, సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడనున్నాయి. ఇందుకోసం రెండు జట్లు తమ స్క్వాడ్‌లను కూడా ప్రకటించాయి. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుంచి నవంబర్ 26 వరకు జరుగుతుంది.

మొదటి టెస్ట్: నవంబర్ 14-18, కోల్‌కతా

రెండవ టెస్ట్: నవంబర్ 22-26, గౌహతి

ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లు

టెస్ట్ సిరీస్ తర్వాత, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారు.

మొదటి వన్డే: నవంబర్ 30, రాంచీ

రెండవ వన్డే: డిసెంబర్ 3, రాయ్‌పూర్

మూడవ వన్డే: డిసెంబర్ 6, విశాఖపట్నం

వన్డే సిరీస్ తర్వాత, ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ టీ20 సిరీస్ డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 19 వరకు జరుగుతుంది.

మొదటి టీ20: డిసెంబర్ 9, కటక్

రెండవ టీ20: డిసెంబర్ 11, న్యూ చండీగఢ్

మూడవ టీ20: డిసెంబర్ 14, ధర్మశాల

నాల్గవ టీ20: డిసెంబర్ 17, లక్నో

ఐదవ టీ20: డిసెంబర్ 19, అహ్మదాబాద్

టెస్ట్ సిరీస్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు:

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జార్జి, ఐడెన్ మార్క్రామ్, జుబైర్ హమ్జా, డెవాల్డ్ బ్రెవిస్, సెనురాన్ ముత్తుసామి, కార్బిన్ బాష్, మార్కో యాన్సెన్, వియాన్ ముల్డర్, ట్రిస్టాన్ స్టబ్స్, కైల్ వెర్రేన్, రియాన్ రికేల్టన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, సైమన్ హార్మర్.

Show Full Article
Print Article
Next Story
More Stories