IND vs SA: భారత జట్టును ఆపడం కష్టం.. రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

IND vs SA
x

IND vs SA: భారత జట్టును ఆపడం కష్టం.. రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Highlights

IND vs SA: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రస్తుత భారత జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

IND vs SA: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రస్తుత భారత జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత భారత జట్టు తనకు పీక్ దశలో ఉన్న ఆస్ట్రేలియా జట్టును గుర్తు చేస్తోందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని ఏ మైదానంలోనైనా, ఏ ప్రత్యర్థినైనా ఓడించే సామర్థ్యం ఈ జట్టుకు ఉందని ప్రశంసించాడు. టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉందని, ఈ ప్రపంచకప్‌లో భారత జట్టును ఆపడం కష్టమీ అని చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ లీగ్ దశలో నాలుగు విజయాలు అందుకుంది. నేడు సూపర్-8 పోరులో పటిష్ట దక్షిణాణఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆటపై పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఆపడం ఏ జట్టుకైనా భారీ పెను సవాలే. ఈప్రస్తుత భారత జట్టులో బలహీనతలు ఏమీ కనిపించడం లేదు. దాదాపు ప్రతి ఆటగాడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. జట్టులోని ప్రతి ప్లేయర్ మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలిగే సామర్థ్యం ఉన్నవారే. అలాగే ప్రతి ఆటగాడికి జట్టులో స్పష్టమైన పాత్ర ఉంది. అందరూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. జట్టు నిర్మాణం, సమతుల్యత, ఆటగాళ్ల నైపుణ్యం చూస్తే.. భారత్ వచ్చే సంవత్సరాల్లో రెండు లేదా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచే అవకాశం ఉంది' అని రికీ పాంటింగ్ అంచనా వేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత బలమైన జట్లలో భారత్ ఒకటిగా నిలుస్తోందని పాంటింగ్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

భారత్ సూపర్‌ 8 దశ పోరాటాన్ని నేడు ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ జట్టు ఎదుర్కోబోతోంది. లీగ్‌ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచి సూపర్‌ 8కు అర్హత సాధించినప్పటికీ.. ఇప్పుడు పెద్ద జట్లతో పోటీ పడాల్సి ఉండటంతో మరింత కఠిన సవాల్‌ తప్పదు. సూపర్-8 దశలో విజయాలు సాధించాలంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లోనూ సమగ్ర ప్రదర్శన అవసరం. అన్ని విభాగాల్లో గొప్పగా రాణిస్తేనే భారత జట్టుకు విజయాలు సొంతమవుతాయి. లీగ్‌ దశలో విజయాలను నమోదు చేసినప్పటికీ కొన్ని విషయాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఓపెనర్ అభిషేక్‌ శర్మ మూడు డకౌట్ల కంటే.. కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ ఆట తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై సూర్య తనదైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించాడు. 171 స్ట్రైక్‌ రేట్‌తో 84 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య.. ఆ తర్వాత జరిగిన మూడు మ్యచుల్లోనూ స్ట్రైక్‌ రేట్‌ 120గానే ఉంది. నంబర్‌ 3లో బ్యాటర్ తిలక్‌ వర్మ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 120 స్ట్రయిక్‌ రేట్‌తో 106 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరు కుదురుకుంటే.. తిరుగుండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories