India Vs Sri Lanka 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

Sandeep Reddy
Published on: 20 July 2021 3:17 PM IST
India Vs Sri Lanka 2nd ODI Sri Lanka Team Won The Toss And Elected to Bat First
X

శ్రీ లంక  Vs ఇండియా 

India Vs Sri Lanka 2nd ODI: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మంగళవారం శ్రీలంకతో రెండవ వన్డేలో తలపడబోతుంది. ఇప్పటికే టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ని ఎంచుకుంది. మొదటి మ్యాచ్ లో ఘన విజయంతో మంచి ఊపు మీదున్న టీంఇండియా జట్టు ఈ మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శనతో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక టాస్ తర్వాత మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ మొదటి వన్ డే లోని ప్లేయర్స్ తోనే రెండవ వన్ డే కూడా ఆడుతున్నామని టీంలో ఎటువంటి మార్పు లేదని తెలిపాడు. ఇక శ్రీలంక జట్టులో మొదటి వన్డేలో ఆడిన ఉదాన స్థానంలో కసున్ రజిత తుది జట్టులో స్థానం పొందాడు.

భారత జట్టు: శిఖర్ ధావన్, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహార్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక జట్టు: దసున్ శనక, మినోద్ భనుక, అవిష్క ఫెర్నాండో, ధనుంజయ డి సిల్వ, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసును రజిత, దుస్మంత చమీర, లక్షన్ సందకన్

Sandeep Reddy

Sandeep Reddy

Next Story