IND vs WI Super 8: టీ20 వరల్డ్‌కప్‌లో హెడ్ టు హెడ్.. భారత్‌ను భయపెడుతున్న వెస్టిండీస్‌ రికార్డ్స్!

IND vs WI Super 8: టీ20 వరల్డ్‌కప్‌లో హెడ్ టు హెడ్.. భారత్‌ను భయపెడుతున్న వెస్టిండీస్‌ రికార్డ్స్!
x

IND vs WI Super 8: టీ20 వరల్డ్‌కప్‌లో హెడ్ టు హెడ్.. భారత్‌ను భయపెడుతున్న వెస్టిండీస్‌ రికార్డ్స్!

Highlights

IND vs WI Super 8: సూపర్ 8 సమరానికి ముందు గణాంకాల గట్టి పోటీ.. టీ20ల్లో విండీస్‌ ఎదుట భారత్‌కు కఠిన పరీక్ష!

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 సూపర్‌-8లో భాగంగా మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో ఆదివారం (మార్చి 1న) రాత్రి 7 గంటలకు భారత్, వెస్టిండీస్‌ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. సెమీ ఫైనల్ చేరాలంటే.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో రెండు టీమ్స్ మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ డూ ఆర్ డై మ్యాచ్ నేపథ్యంలో భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య టీ20, వరల్డ్‌కప్‌ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఓసారి చూద్దాం.

భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ అంటే ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ముఖ్యంగా టీ20 వరల్డ్‌ కప్‌లో ఈ రెండు జట్లు తలపడిన సందర్భాలు మరింత ఆసక్తికరంగా నిలిచాయి. ఇప్పటివరకు వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్–వెస్టిండీస్ నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవగా.. వెస్టిండీస్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ గణాంకాలు చూస్తే ప్రపంచకప్ వేదికపై కరేబియన్ జట్టు స్పష్టమైన ఆధిక్యం కనబరిచిందని చెప్పాలి.

స్కోర్ల పరంగా చూస్తే.. విండీస్‌పై భారత్ అత్యధికంగా 192 పరుగులు చేయగా, అత్యల్ప స్కోరు 130. అదే విధంగా భారత్‌పై వెస్టిండీస్ అత్యధికంగా 196 పరుగులు నమోదు చేయగా, కనిష్ట స్కోరు 129. అంటే రెండు జట్లు బ్యాటింగ్ పరంగా సమాన స్థాయిలో పోటీ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కీలక మ్యాచ్ ముందు భారత్‌ను వెస్టిండీస్‌ రికార్డ్స్ పభపెడుతున్నాయి. అయితే అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల రికార్డు చూస్తే భారత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు.

అంతర్జాతీయ టీ20ల్లో భారత్ స్వదేశంలో 8, వెస్టిండీస్ గడ్డపై 5, తటస్థ వేదికలపై 6 విజయాలు నమోదు చేసింది. మరోవైపు విండీస్ స్వదేశంలో 5, భారత గడ్డపై 2, తటస్థ వేదికలపై 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. మొత్తం గణాంకాలను పరిశీలిస్తే.. సాధారణ టీ20ల్లో భారత్ ఆధిపత్యం చూపుతున్నప్పటికీ, వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో మాత్రం వెస్టిండీస్ పైచేయి కొనసాగిస్తోంది. అందుకే ఈ రెండు జట్లు తలపడే ప్రతి మ్యాచ్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పుడు అభిమానుల ఆసక్తి మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపే ఉంది. ఏ జట్టు సెమీస్ చేరుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories