Under-19 World Cup 2026: వరల్డ్ కప్ కొట్టిన కుర్రాళ్లకు కాసుల వర్షం: ఏకంగా రూ. 7.5 కోట్ల భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ!

India Wins Under-19 World Cup 2026: భారత యువ క్రికెట్ జట్టు (India U-19) మరోసారి చరిత్ర సృష్టించింది.
India Wins Under-19 World Cup 2026: భారత యువ క్రికెట్ జట్టు (India U-19) మరోసారి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగిన అండర్-19 పురుషుల ప్రపంచకప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో మట్టికరిపించి, రికార్డు స్థాయిలో ఆరోసారి ఛాంపియన్‌గా అవతరించింది.
భారత్ భారీ స్కోరు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరును సాధించింది. 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్ బౌలర్లను ఆడుకున్నాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (53), వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (40) రాణించడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తలవంచింది. ఇంగ్లండ్ బ్యాటర్ కాలెబ్ ఫాల్కనర్ (115) వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ, మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
భారత యువ జట్టు అద్భుత ప్రదర్శనకు ముగ్ధులైన బీసీసీఐ (BCCI) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. విజేత జట్టు, సహాయక సిబ్బంది మరియు సెలక్షన్ కమిటీకి కలిపి మొత్తం రూ. 7.5 కోట్లు అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. త్వరలోనే ఈ నగదు పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఈ విజయంతో భారత్ ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం అండర్-19 పురుషుల, మహిళల ప్రపంచకప్ టైటిళ్లు రెండూ భారత్ వద్దే ఉండటం విశేషం. పటిష్టమైన దేశీయ క్రికెట్ నిర్మాణం వల్లే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని సైకియా ప్రశంసించారు. మరోవైపు, సీనియర్ జట్ల సెంట్రల్ కాంట్రాక్టులపై కూడా త్వరలోనే ప్రకటన ఉంటుందని ఆయన హింట్ ఇచ్చారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



