IPL 2025: పాయింట్ల పట్టికలో సంచలనం! టైటిల్ ఫేవరెట్లు వెనుకడుగు!

IPL 2025 Points Table: Teams with 15 Titles Out of Top 5, Single-Title Holders Lead
x

IPL 2025: పాయింట్ల పట్టికలో సంచలనం! టైటిల్ ఫేవరెట్లు వెనుకడుగు!

Highlights

IPL 2025: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక మొదటి 11 మ్యాచ్‌ల తర్వాత ఆసక్తికరంగా మారింది. 10 జట్ల ఈ క్రికెట్ సమరంలో ఐపీఎల్ లో 15 ట్రోఫీలు గెలిచిన జట్లు టాప్ 5 నుంచి బయట ఉన్నాయి.

IPL 2025: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టిక మొదటి 11 మ్యాచ్‌ల తర్వాత ఆసక్తికరంగా మారింది. 10 జట్ల ఈ క్రికెట్ సమరంలో ఐపీఎల్ లో 15 ట్రోఫీలు గెలిచిన జట్లు టాప్ 5 నుంచి బయట ఉన్నాయి. కేవలం ఒక్క టైటిల్ గెలిచిన జట్లు ఈసారి ప్లేఆఫ్ రేసులో ముందున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏ ఒక్క జట్టు కూడా 15 ట్రోఫీలు గెలవలేదు. మనం 15 ట్రోఫీలు గెలిచిన ఒక జట్టు గురించి కాదు. ఐపీఎల్ లో 15 టైటిళ్లను కలిసి గెలుచుకున్న 5 జట్ల గురించి ఈ వార్తలో ప్రస్తావిస్తున్నాం.. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలోని టాప్ 5 నుంచి ఆ టీంలన్నీ బయటే ఉన్నాయి. మరి టాప్ 5లో ఎవరున్నారు? అంటే, ఇప్పటివరకు మొత్తంగా కేవలం ఒక ఐపీఎల్ ట్రోఫీని మాత్రమే తమ ఖాతాలో వేసుకున్న 5 జట్లు.

మార్చి 30న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత కూడా ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ రెండు మ్యాచ్‌లను గెలిచింది.. కానీ రన్ రేట్ ఆర్సీబీ కంటే తక్కువగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమిని చవిచూశాయి. కానీ, మెరుగైన రన్ రేట్ కారణంగా లక్నో 3వ స్థానంలో ఉంది. గుజరాత్ జట్టు 4వ స్థానంలో ఉంది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది, ఈ సీజన్‌లో ఆడిన తన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలోని టాప్ 5 జట్లను పరిశీలిస్తే, వారందరి ఖాతాలో కలిపి కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ టైటిల్ ఉంది. గుజరాత్ టైటాన్స్ 2022 ఐపీఎల్ లో ఆ టైటిల్‌ను గెలుచుకుంది.

ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ఐదు స్థానాల్లో ఉన్న జట్ల ఖాతాలో మొత్తంగా 15 టైటిళ్లు ఉన్నాయి. 3 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమితో 6వ స్థానంలో ఉంది. 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన CSK పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 ఓడిపోయి 7వ స్థానంలో ఉంది. ఒకసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 3 మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఐపీఎల్ 2008 ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాత 9వ స్థానంలో ఉంది. అయితే 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories