Yuzvendra Chahal: చాహల్‌ను పొగడ్తలతో ముంచెత్తిన RJ మహవాష్.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌

Yuzvendra Chahal
x

Yuzvendra Chahal: చాహల్‌ను పొగడ్తలతో ముంచెత్తిన RJ మహవాష్.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌

Highlights

Yuzvendra Chahal: మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం 111 పరుగులే చేసిన పంజాబ్, తక్కువ స్కోరు కూడా ఎలా కంట్రోల్‌ చేయొచ్చో ఈ మ్యాచ్‌ ద్వారా నిరూపించింది.

Yuzvendra Chahal: మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం 111 పరుగులే చేసిన పంజాబ్, తక్కువ స్కోరు కూడా ఎలా కంట్రోల్‌ చేయొచ్చో ఈ మ్యాచ్‌ ద్వారా నిరూపించింది. చాహల్‌ అద్భుతమైన బౌలింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో తక్కువ స్కోర్‌ కంట్రోల్‌ చేసిన మ్యాచ్‌గా నిలిచింది.

పంజాబ్ లెగ్ స్పిన్నర్ యూజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతా 62-2 వద్ద మంచి స్థితిలో ఉన్నప్పటికీ, చాహల్‌ స్పిన్‌ దాటికి 15.1 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది.

కోల్‌కతా తరఫున ఆండ్రే రస్సెల్ చివర్లో కొన్ని మంచి షాట్స్‌ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. అతన్ని మార్చో జాన్సన్ బౌల్డ్ చేయగా, స్టేడియం మొత్తం ఉల్లాసంలో మునిగిపోయింది. కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ, "ఐపీఎల్‌లో నేను చూసిన అత్యుత్తమ గెలుపుల్లో ఇది ఒకటి" అని హర్షం వ్యక్తం చేశాడు.

చాహల్‌ను పొగడ్తలతో ముంచెత్తిన RJ మహవాష్:

ఇదిలా ఉంటే ఉంటే ఈ విజయంపై రేడియో జాకీ మహవాష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చాహల్‌తో ఉన్న ఫొటో షేర్ చేస్తూ, "వాటే టాలెంటెడ్‌ మ్యాన్‌. ఐపీఎల్‌లో టాప్ వికెట్ టేకర్ కావడానికి ఇదే కారణం. అసంభవ్‌' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే మ్యాచ్‌ ఫలితంపై కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ.. "తప్పు నాదే. తప్పు షాట్ ఆడేశాను. బంతి స్టంప్‌కు బయటగా ఉన్నా రివ్యూ తీసుకోలేదు," అని చెప్పాడు. ఆ తర్వాత చాహల్ వరుసగా వికెట్లు తీసి కోల్‌కతా విజయ అవకాశాలను దూరం చేశాడు అని చెప్పుకొచ్చాడు.

ఇక పంజాబ్ బ్యాటింగ్‌ విషయానికొస్తే ప్రారంభంలో ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్ మెరుపు ప్రారంభం ఇచ్చారు. కానీ హర్షిత్ రానా, రమందీప్ సింగ్, చక్రవర్తి, నరైన్‌ల బౌలింగ్‌ దాటికి పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. కానీ చివరికి పంజాబ్ బౌలర్లు జట్టు కోసం మ్యాచును నిలబెట్టారు. చాహల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ గెలుపుతో పంజాబ్ టాప్-4లోకి దూసుకెళ్లింది. పంజాబ్‌ ఇప్పటివరకు 6 మ్యాచుల్లో 4 విజయాలు సాధించింది.





Show Full Article
Print Article
Next Story
More Stories