IPL 2026 Postponed: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు..!


IPL 2026 Postponed: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు..!
IPL 2026 Postponed: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 బదులుగా మార్చి 28న ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతోంది.
IPL 2026 Postponed : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభ తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం మార్చి 26న ప్రారంభం కావాల్సిన 19వ సీజన్, రెండు రోజులు ఆలస్యంగా మార్చి 28న ప్రారంభమై మే 31న ముగియనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన వెంటనే ఐపీఎల్‌పై అభిమానుల దృష్టి నిలవనుంది. అయితే పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్ విడుదల ఆలస్యమవుతున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడంతో మ్యాచ్‌ల షెడ్యూల్‌పై ప్రభావం పడింది.
కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల హోమ్ మ్యాచ్‌లు ఆయా రాష్ట్రాల్లోనే నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికల తేదీలకు అనుగుణంగా షెడ్యూల్ రూపొందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజస్థాన్ రాయల్స్ తమ రెండో హోమ్ గ్రౌండ్‌గా గువహటిని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా షెడ్యూల్‌ను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశముందని సమాచారం.
ఇక ప్రారంభ మ్యాచ్ వేదికపై కూడా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. నిబంధనల ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ సొంత మైదానంలోనే ప్రారంభ మ్యాచ్ జరగాలి. అయితే చిన్నస్వామి స్టేడియంలో గతంలో జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా భద్రతా అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ హోమ్ మ్యాచ్‌లను బెంగళూరు వెలుపల నిర్వహించే అవకాశాలపై బీసీసీఐ పరిశీలిస్తోంది. నవీ ముంబై, రాయ్‌పూర్, పుణే నగరాలను ప్రత్యామ్నాయ వేదికలుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలో జరగనున్న గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



