
Gautam Gambhir-IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌లో భారీ మార్పులు?.. గౌతమ్ గంభీర్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్, కానీ..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి సంబంధించి ఓ సంచలన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి సంబంధించి ఓ సంచలన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్‌కు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ప్రాంచైజీ కీలక పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. టీమ్ మెంటార్, ప్రాంచైజీ సీఈవో, స్ట్రాటజిక్ పార్టనర్ స్థానాలు ఆర్ఆర్ ఆఫర్ చేసిందట. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ త్రిపాఠి వెల్లడించారు. అంతేకాదు రాజస్థాన్ జట్టుకు కొత్త యజమానులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జట్టు నిర్వహణలో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ వాటాలు చేతులు మారనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు సమాచారం. మాజీ భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను భాగస్వామి లేదా మెంటర్‌గా చేర్చుకోవాలని కొత్త యజమానులు ఆసక్తిగా ఉన్నారట. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే గౌతీకి పంపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా ఉన్నందున గంభీర్ ఐపీఎల్ ఆఫర్‌ను అంగీకరించడం సాధ్యం కాదు. బీసీసీఐ నియమాల ప్రకారం.. భారత జట్టు కోచ్‌గా ఉన్న వ్యక్తి ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీతోనూ నేరుగా సంబంధం కలిగి ఉండకూడదన్న విషయం తెలిసిందే.
భారత జట్టుతో గౌతమ్ గంభీర్ ఒప్పందం వన్డే ప్రపంచకప్ 2027 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026తో తీరిక లేకుండా ఉన్నాడు. 2027లో వన్డే వరల్డ్ కప్ ఉన్నందున గంభీర్ పూర్తిగా జట్టు కాంబోపై దృష్టి పెట్టనున్నాడు. అంతేకాదు దీర్ఘకాలిక లక్ష్యంగా ఒలింపిక్స్ 2028లో భారత్‌కు పతకం సాధించాలనే విజన్‌తో గంభీర్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన భారత జట్టుతో పూర్తి సమయం కేటాయించాల్సి ఉండటంతో.. ఐపీఎల్ ఆఫర్ ఒప్పుకునే అవకాశాలు దాదాపుగా లేవు.
గౌతమ్ గంభీర్ ఆటగాడిగా మాత్రమే కాదు.. మెంటర్‌గా కూడా విజయం సాధించాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు టైటిళ్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర (రెండుసార్లు కెప్టెన్‌గా, ఒకసారి మెంటార్‌గా) పోషించాడు. లక్నో జట్టుతో పని చేసిన అనుభవం, వ్యూహాత్మక ఆలోచన, కఠిన నిర్ణయాలు తీసుకునే స్వభావం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనను జట్టులో కీలక పాత్రలోకి తీసుకురావాలని రాజస్థాన్ యాజమాన్యం ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో పరిస్థితులు మారితే మాత్రం గంభీర్–రాజస్థాన్ కాంబినేషన్ ఐపీఎల్లో పెద్ద సంచలనంగా మారే అవకాశముంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




