IPL 2026: హైదరాబాద్‌కు 'ఆరెంజ్ ఆర్మీ' గుడ్‌బై? వైజాగ్‌కు తరలనున్న సన్‌రైజర్స్ మ్యాచ్‌లు!

IPL 2026: హైదరాబాద్‌కు 'ఆరెంజ్ ఆర్మీ' గుడ్‌బై? వైజాగ్‌కు తరలనున్న సన్‌రైజర్స్ మ్యాచ్‌లు!
IPL 2026: భారత్‌లో క్రికెట్ అంటే ఒక మతం లాగా. ఐపీఎల్ వచ్చాక ఆ ఫీవర్ ఇంకాస్త ఎక్కువైంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నంత కాలం.. క్రికెట్ అభిమానులకు ఒక పండగ అనే చెప్పాలి.
IPL 2026: భారత్‌లో క్రికెట్ అంటే ఒక మతం లాగా. ఐపీఎల్ వచ్చాక ఆ ఫీవర్ ఇంకాస్త ఎక్కువైంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నంత కాలం.. క్రికెట్ అభిమానులకు ఒక పండగ అనే చెప్పాలి. 2008లో ఐపిఎల్ ప్రారంభం అవ్వగా ప్రస్తుతం ఐపిఎల్ 19వ సీజన్‌కు చేరుకుంది. త్వరలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు షెడ్యూల్ ని విడుదల చేశారు. మొత్తం 10 జట్లు పోటీపడుతున్నాయి. ఈసారి ఐపిఎల్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే బిసిసిఐ షెడ్యుల్‌ను కూడా విడుదల చేసింది. మార్చి 26 నుంచి మే 31 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. అన్ని జట్లు తమ హోమ్ గ్రౌండ్‌తో పాటు మరొక ప్రాంతంలోని గ్రౌండ్‌ను కూడా సెలక్ట్ చేసుకుంటాయి. అయితే ఈ సారి భాగ్యనగర వాసులకు మ్యాచ్ లు చూసే అదృష్టం లేనట్టే కనపడుతోంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ హోం గ్రౌండ్‌గా సాగుతున్న ఫ్రాంఛైజ్. ఉప్పల్ స్టేడియంలో SRH మ్యాచ్ ఉంటే చాలు ఆరెంజ్ ఆర్మీతో గ్రౌండ్ నిండిపోయేది. ఐతే గతేడాది టికెట్ల విషయంలో SRH యాజమాన్యం, హెచ్‌సీఎ మధ్య వివాదం తలెత్తింది. రెగ్యులర్ గా ఇచ్చే టికెట్లు కాకుండా అదనంగా మరో 10శాతం ఫ్రీ టికెట్లు కావాలని SRH ఫ్రాంఛైజ్‌పైన HCA తీవ్ర ఒత్తిడి తెచ్చింది అనేది ఆరోపణ. అందుకు టీం యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో..కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసి వెళ్లిపోయింది హెచ్‌సిఎ. దీంతో గొడవ ముదిరి పెద్దదయ్యింది. ముఖ్యంగా అప్పటి హెచ్‌సీఎ ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రావు అతివల్ల సన్ రైజర్స్ ఒక సందర్భంలో హోమ్ గ్రౌండ్ ను విడిచి వెళ్లిపోతామని హెచ్చరించింది. ఈ విషయం బిసిసిఐ వరకు వెళ్ళడంతో హెచ్‌సీఏపై సీరియస్ అయ్యింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ వేసింది. అదనపు కంప్లిమెంటరీ టికెట్ల కోసం.. SRHను వేధించిన మాట వాస్తవమేనని దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఆ తర్వాత అవినీతి కేసుల్లో చిక్కుకోవడంతో జగన్మోహన్ రావును తొలగించారు.
ప్రస్తుతం ఐపిఎల్ 19వ సీజన్‌కు సిద్దమవుతున్న తరుణంలో మరోసారి సన్ రైజర్స్ ఎటువైపు వెళ్తుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఉన్న ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్ గా కొనసాగిస్తారా లేక వైజాగ్ కు షిఫ్ట్ అవుతారా అనేది క్లారిటీ రాలేదు. అప్పటి ప్రెసిడెండ్ జగన్మోహన్ లేకపోవడంతో ఈ సారి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా SRH.. హైదరాబాద్ హోం గ్రౌండ్ ను విడిచి వెళ్ళకుండా ప్రయత్నాలు చేస్తుందట.
హెచ్‌సిఏకు కొత్త ప్రెసిడెంట్‌గా వచ్చిన అమర్నాధ్ ఈ విషయంలో ఏ మేరకు చొరవ చూపిస్తారో క్లారిటీ లేదు. మరోవైపు ఆరెంజ్ ఆర్మీ ఫ్రాంచైజ్ ఓనర్ కావ్య మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. హోమ్ గ్రౌండ్‌గా వైజాగ్.. రెండవ ఆప్షన్‌గా ఢిల్లీ లేదా బెంగుళూరు వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. HCAతో పోలిస్తే ఆంధ‌్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించే విధానం పట్ల సన్ రైజర్స్ యాజమాన్యం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి మ్యాచ్‌లు బీచ్ సిటీకి తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయట. మరోవైపు బిసిసిఐ సైతం హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలపై కొంత సీరియస్ గానే ఉంది. మ్యాచ్‌ల కేటాయింపులో హైదరాబాద్ కు కొంత ప్రాధాన్యత తగ్గించినట్టే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఐపిఎల్ సీజన్ వివాదాలకు తోడు హెచ్‌సిఎలో అవినీతి వెరసీ... ఐపిఎల్ తో పాటు రాబోయే రోజుల్లో మ్యాచ్ ల ఏర్పాటు ప్రశ్నార్ధకంగా మారింది.
ఏది ఏమైనా భాగ్యనగర క్రికెట్ ప్రేమికులకు ఈసారి హోం గ్రౌండ్‌లో ఐపిఎల్ మ్యాచ్ లు చూడటం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తోందట. మరి దీనిపై ప్రభుత్వ ప్రయత్నం ఎలా ఉంటుంది. srh యాజమాన్యం మదిలో ఏముందో అని ఉత్కంఠగా రేపుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



