IPL2023: పుచ్చుకుంది రూ.16 కోట్లు..చేసింది 15 పరుగులు..అడిగితే బెన్ స్టోక్స్ సమాధానం ఇది..

IPL2023: పుచ్చుకుంది రూ.16 కోట్లు..చేసింది 15 పరుగులు..అడిగితే బెన్ స్టోక్స్ సమాధానం ఇది..
x

IPL2023: పుచ్చుకుంది రూ.16 కోట్లు..చేసింది 15 పరుగులు..అడిగితే బెన్ స్టోక్స్ సమాధానం ఇది.

Highlights

స్టార్ ఆల్ రౌండర్ గా పేరు పొందడంతో బెన్ స్టోక్స్ కు రూ.16 కోట్లు చెల్లించి సీఎస్కే యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. అయితే ఈ ఆల్ రౌండర్ మాత్రం రెండు మ్యాచులే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టుకు 18 పరుగులు సమర్పించుకున్నాడు.

Ben Stokes: ఐపీఎల్ 2023 అట్టహాసంగా ముగిసింది. ఫైనల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ను ఓడించి 16వ సీజన్ విజేతగా ధోనీ నేతృత్వంలోని సీఎస్కే జట్టు కప్ గెలుచుకుంది. ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్ లో యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ ఇలా యువ ప్లేయర్లు ధీటుగా ఆడి ఆకట్టుకుంటే భారీ ధర పలికిన కొంతమంది ఆటగాళ్లు మాత్రం పేలవ ప్రదన్శన ఇచ్చారు. ఈ లిస్ట్ లో ప్రధమంగా చెప్పుకోవాల్సింది వ్యక్తి బెన్ స్టోక్స్.

స్టార్ ఆల్ రౌండర్ గా పేరు పొందడంతో బెన్ స్టోక్స్ కు రూ.16 కోట్లు చెల్లించి సీఎస్కే యాజమాన్యం జట్టులోకి తీసుకుంది. అయితే ఈ ఆల్ రౌండర్ మాత్రం రెండు మ్యాచులే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఒక ఓవర్ బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టుకు 18 పరుగులు సమర్పించుకున్నాడు. బెన్ స్టోక్స్ కాలి గాయం కారణంగా ఎక్కువగా బెంచ్ కే పరిమితం అయ్యాడు. ప్లే ఆఫ్స్ కు అందుబాటులో ఉంటాడులే అనుకుంటే యాషెస్ పోరు ఉందంటూ ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు.

బెన్ స్టోక్స్ గణాంకాలు చూస్తే..ఒక్కో పరుగుకు ఒక్కో కోటి రూపాయలు సొంతం చేసుకున్నట్లైంది. ఇక ఇదే విషయమై బెన్ స్టోక్స్ భలే కామెడీగా స్పందించాడు. సీఎస్కే జట్టు ఐపీఎల్ విజయంపై తనదైన రీతిలో హ్యుమరస్ గా వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ విజయంలో తాను జాన్ టెర్రి రోల్ ను పోషించానంటూ సరదా వ్యాఖ్యానం చేశాడు. 2012 ఫుట్ బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ విజేతగా చెల్సియా జట్టు గెలుపొందింది. బేయర్న్ మ్యూనిచ్ పై జరిగిన ఫైనల్ పోరులో చెల్సియా జట్టు విజయం సాధించింది. అయితే సస్పెన్షన్ కారణంగా ఈ ఫైనల్ పోరుకు జాన్ టెర్రి దూరం అయ్యాడు. ఫైనల్ మ్యాచ్ ఆడకపోయినా..కప్ ను మాత్రం అతడే అందుకున్నాడు. నాటి ఉదంతాన్ని గుర్తుకు తెస్తూ, సీఎస్కే విజయంలో తాను జాన్ టెర్రి పాత్ర పోషించానంటూ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ ఫైనల్ పోరు కంటే ముందే తన స్వదేశానికి చెక్కేసిన బెన్ స్టోక్స్..గుజరాత్ తో తన టీమ్ జరిపిన ఫైనల్ బ్యాటిల్ ను కెన్సింగ్టన్ లోని రాయల్ గార్డెన్ హోటల్ లోని బార్ లో కూర్చొని తన ఫోన్ లో తిలకించాడు. మొత్తానికి, సీఎస్కే యాజమాన్యం ఒకటి తలిస్తే విధి మరోలా సమాధానం ఇచ్చింది. ఇంగ్లండ్ ప్లేయర్లను ఐపీఎల్ లోకి తీసుకోవద్దని సీఎస్కే అభిమానులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories