IPL Media Rights Auction: రికార్డు స్థాయిలో అమ్ముడైన IPL ప్రసార హక్కులు

IPLs TV and Digital Rights Reportedly Sold for Rs 44,075 Crore
x

IPL Media Rights Auction: రికార్డు స్థాయిలో అమ్ముడైన IPL ప్రసార హక్కులు

Highlights

*డిజిటల్ ప్రసార హక్కులు పొందిన వయాకమ్ 18 *టీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న సోనీ

IPL Media Rights Auction: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. మరి దాని ప్రసార హక్కుల కోసం పోటీ మామూలుగా ఉంటుందా? ముంబై వేదికగా దీని కోసం బీసీసీఐ నిర్వహించిన ఈ-వేలంలో ఇదే విషయం స్పష్టమైంది. ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జియో, స్టార్, సోనీ తదితర దిగ్గజ కంపెనీలో పోటీపడ్డాయి.

చివరకు ఈ హక్కులను అక్షరాలా 44,075 కోట్ల రూపాయలకు ఈ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్యాకేజ్ ఏలో టీవీ హక్కులు, ప్యాకేజ్ బీలో డిజిటల్ హక్కులను బీసీసీఐ అమ్మకానికి పెట్టింది. వీటిలో ప్యాకేజ్ ఏ అంటే టీవీ ప్రసార హక్కులను సోనీ సంస్థ రూ.23, 575 కోట్లకు దక్కించుకోగా.. భారత ఉపఖండం వరకూ డిజిటల్ ప్రసార హక్కులను జియోకు చెందిన వయాకామ్18 సంస్థ రూ.20,500 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

దీంతో మొత్తం ఈ రెండు హక్కులకు కలిపి ఏకంగా 44, 075 కోట్ల రూపాయలు బీసీసీఐకు దక్కాయి. 2023 నుంచి 2027 వరకు మొత్తం ఐదేళ్ల కాలానికి నిర్వహించిన ఈ వేలంలో రెండు ప్యాకేజీలకు కలిపి బేస్ ధరను 33,340 కోట్లుగా బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పుడు అనుకున్న దానికంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు అధికంగా రావడంతో బీసీసీఐకి కాసుల పంట పండినట్లే. ఇంత ధర పలకడంతో ఐపీఎల్‌ వచ్చే సీజన్‌లో ప్రతి మ్యాచ్ విలువ రూ.107.5 కోట్లకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories