Jahnavi Mehta: రూ.4,600 కోట్ల సంపదకు రాకుమారి.. ఈమె ముందు కావ్య, ప్రీతి అందం కూడా దిగదుడుపే!

Jahnavi Mehta Juhi Chawla KKR Shahrukh Khan IPL 2025 News Updates
x

Jahnavi Mehta: రూ.4,600 కోట్ల సంపదకు రాకుమారి.. ఈమె ముందు కావ్య, ప్రీతి అందం కూడా దిగదుడుపే!

Highlights

ఐపీఎల్‌ ఓనర్లలో అందంగా ఎవరుంటారంటే చాలా మంది కావ్య, ప్రీతి పేర్లు చెబుతారు. అయితే ఒక్క నిమిషం ఆగండి..!

Jahnavi Mehta: ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న స్టార్ట్ కానుంది. తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా ఐపీఎల్ కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాకుండా.. వ్యాపార ప్రపంచాన్ని కూడా కనువిందు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆటకు గ్లామర్‌ తోడైతే ఆ ఆనందమే వేరు కదా! అందులోనూ ఈ సారి ఓ అమ్మాయి పేరు ఎక్కువగా వినపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఆమె పేరే జానవి మెహతా.

ఎవరీ జానవి?

బాలీవుడ్ నటి, ప్రముఖ వ్యాపారవేత్త జూహీ చావ్లా, జయ్ మెహతా కుమార్తె జానవి. KKRలో షారుఖ్‌ ఖాన్‌తో పాటు జూహీకి కూడా వాట ఉందని తెలుసు కదా! ఈ సారి జూహీ కుమార్తెగా కేకేఆర్‌కు మరింత దగ్గర కావాలని చూస్తోంది జానవి. గత ఐపీఎల్ వేలంలో ఆమె సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. KKR యజమాన్య బృందంలో ఆమె తన తండ్రితో కలిసి పాల్గొనడం, స్ట్రాటజీలను వెయ్యడం ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి జానవికి క్రికెట్‌ను ఒక వ్యాపారం మాత్రమే కాదు.. చాలా ఇష్టం కూడా. చిన్నప్పటి నుంచే ఆమె KKR జట్టును ఫాలో అవుతూ వచ్చింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్‌ కేకేఆర్‌ టీమ్‌ బాధ్యతల్లోకి నేరుగా ఇప్పటివరకు ప్రవేశించలేదు కానీ.. జానవి మాత్రం కోల్‌కతా మేనేజ్‌మెంట్‌లో పలు బాధ్యతలను స్వయంగా స్వీకరించింది.

ఆస్తి ఎంత ఉందంటే?

జానవి మెహతా సుమారు రూ. 4,171 కోట్ల మేర విలువైన వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు. ఆమె తండ్రి జయ్ మెహతా 'మెహతా గ్రూప్' అధినేతగా ఉన్నారు. ఈ సంస్థ ప్యాకేజింగ్, సిమెంట్, వ్యవసాయం, నిర్మాణ సామగ్రి సహా అనేక రంగాల్లో విస్తరించింది. అమెరికా, కెనడా, యుగాండా, కెన్యా లాంటి దేశాల్లోనూ ఈ గ్రూప్‌కు వ్యాపారాలున్నాయి. ఇక ఇప్పటికే జానవి తల్లి జూహీ చావ్లా కూడా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. కేవలం మూవీస్‌లోనే కాకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టే వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్‌లో, ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయ పరిశ్రమలో ఆమె పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆమె మొత్తం సంపద రూ. 4,600 కోట్లు అని హురూన్ రిచ్ లిస్టు 2024 రిపోర్టు చెబుతోంది.

వాస్తవానికి ప్రతిసారి ఐపీఎల్‌లో ప్రీతి జింతా , కావ్య మారన్ లాంటి వారి గురించే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం జానవి అందరి దృష్టిని ఆకర్షించనుందని చెప్పడంలే ఎలాంటి డౌట్ లేదు. జట్టును మరింత బలంగా తీర్చిదిద్దే విధంగా ప్లేయర్ల ఎంపిక చేయడం లాంటి అంశాల్లో ఆమె తన స్కిల్‌ను చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories