Jasprit Bumrah History: టీ20 వరల్డ్‌కప్‌లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర.. 'ఒకే ఒక్కడు'!

Jasprit Bumrah History: టీ20 వరల్డ్‌కప్‌లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర.. ఒకే ఒక్కడు!
x

Jasprit Bumrah History: టీ20 వరల్డ్‌కప్‌లో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర.. 'ఒకే ఒక్కడు'!

Highlights

టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌‌‌ర్‌గా నిలిచాడు.

టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌‌‌ర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచ కప్‌ 2026 సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఈ ఘనత సాధించాడు. బుమ్రా ఇప్పటివరకు 33 వికెట్లు పడగొట్టి భారత బౌలింగ్ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుతున్నాడు. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకుని వికెట్లు తీయగలిగే సామర్థ్యం బుమ్రాను ప్రత్యేకంగా నిలబెడుతోంది.

ఈ మ్యాచ్ ముందు వరకు ఈ రికార్డు యువ పేసర్ అర్షదీప్ సింగ్ పేరిట ఉంది. అర్షదీప్ ఇప్పటివరకు 32 వికెట్స్ పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్స్ పడగొట్టడంతో అర్షదీప్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు. యాష్ కూడా 32 వికెట్స్ తీశాడు. అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఉన్నాడు. హార్దిక్ 29 వికెట్లతో ఈ జాబితాలో నిలిచాడు. ఐదో స్థానంలో మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 22 వికెట్లతో ఉన్నాడు. జడేజా తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌తో కూడా జట్టుకు సేవలందించాడు. యాష్, జడ్డు ఇద్దరూ టీ20లు ఆడడం లేదు. ఇప్పుడు ప్రధాన పోటీ జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ మధ్యనే ఉంది. ఇద్దరు కూడా టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో ఆడుతున్నారు. మెగా టోర్నీ ముగిసేలోపు ఎవరు టాప్ ప్లేస్ దక్కించుకుంటారో చూడాలి.

T20 ప్రపంచ కప్‌లలో అత్యధిక వికెట్లు:

33 జస్ప్రీత్ బుమ్రా

32 అర్ష్‌దీప్ సింగ్

32 ఆర్ అశ్విన్

29 హార్దిక్ పాండ్యా

22 రవీంద్ర జడేజా

Show Full Article
Print Article
Next Story
More Stories