Kamal Hassan: అన్ని ఆటలకూ ఇలానే ఉంటే.. టీమిండియా విజయంపై కమల్ సంచలన వ్యాఖ్యలు

Kamal Hassan: విలక్షణ నటుడు, పార్లమెంట్ సభ్యుడు కమల్ హాసన్ టీమిండియాను అభినందిస్తూనే భారత క్రీడారంగంపై  వ్యాఖ్యలు
x

Kamal Hassan

Highlights

Kamal Hassan: విలక్షణ నటుడు, పార్లమెంట్ సభ్యుడు కమల్ హాసన్ టీమిండియాను అభినందిస్తూనే భారత క్రీడారంగంపై చేసిన వ్యాఖ్యలు ఆలోచింపచేసేవిగా ఉన్నాయి.

Kamal Hassan: టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. టీమిండియా విజయంపై సెలబ్రిటీలు తమదైన శైలిలో అభినందనలు తెలుపుతున్నారు. అందరూ టీమిండియాను పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే, నటుడు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కమల్ హాసన్ విశ్వవిజేతగా టీమిండియా నిలవడాన్ని స్వాగతిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన X వేదికగా కమల్ హాసన్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

"మన మెన్ ఇన్ బ్లూ, వరుసగా ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఛాంపియన్లు! పురుషుల ICC క్రికెట్ ప్రపంచ కప్ రన్నరప్. మహిళల ICC మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఛాంపియన్లు. రంజీ ట్రోఫీ నుండి IPL వరకు క్రికెట్ లో భారతదేశ లోతైన దేశీయ పర్యావరణ వ్యవస్థకు నిదర్శనం. @BCCI" అంటూ ఆయన తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

దీనితరువాతే ఆయన అసలైన మాటలు చెప్పారు. క్రికెట్ కు ఉన్న ఇదేరకమైన పర్యావరణ వ్యవస్థ మిగిలిన అన్ని ఆటలకూ ఉంటే మన దేశం ఎన్ని అద్భుతాలు చేయగలడో ఊహించండి అంటూ ఆయన కోరారు. .

"ప్రతి క్రీడలో ఇలాంటి దేశీయ పర్యావరణ వ్యవస్థ ఉంటే భారతదేశం ఏమి సాధించగలదో ఊహించుకోండి. భారత యువత సామర్థ్యం అపరిమితమైనది. గల్లీల నుండి గ్రాండ్ స్టేడియంల వరకు, చిన్ననాటి కలల నుండి ప్రపంచ ఛాంపియన్ల వరకు - భారతదేశం అద్భుతాలు చేయగలదు” అని ఆయన పేర్కొన్నారు.

కమల్ హాసన్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజమే కదా.. భారతదేశంలో యువతకు నైపుణ్యాలకు కొదవలేదు. క్రికెట్ ను ప్రోత్సహించిన విధంగానే అదే మోడల్ లో అన్ని ఆటల్లోనూ ప్రోత్సాహాన్ని తీసుకు వస్తే కచ్చితంగా భారత్ క్రీడల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి దూసుకుపోతుంది అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Kamal Hassan:ఇదిలా ఉంటె భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం సాధించినందుకు నటులు రామ్ చరణ్, మహేష్ బాబు, నితిన్, రవితేజ, వెంకటేష్ సహా పలువురు దక్షిణాది తారలు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేశారు. టీమిండియాకు అభినందనలు తెలిపారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం 86,824 మంది అభిమానుల సమక్షంలో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి పురుషుల T20 ప్రపంచ కప్ టైటిల్‌ను నిలుపుకున్న తొలి జట్టుగా.. రికార్డు స్థాయిలో మూడుసార్లు కిరీటాన్ని గెలుచుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది.

సంజు సామ్సన్ 46 బంతుల్లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 89 పరుగులు చేయడంతో, భారత్ T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరు 255/5కు చేరుకుంది, బుమ్రా మరియు అక్షర్ పటేల్ (3-27) న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను చిత్తు చేసి విజయాన్ని నమోదు చేశారు. న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ టీమ్ లో టిమ్ సీఫెర్ట్ మాత్రమే 52 పరుగులతో కాస్త ప్రతిఘటించగలిగాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories