Kavya Maran: ఇంత ఈజీ క్యాచ్ వదిలేస్తావా.. హర్షల్ పై కావ్య మారన్ సీరియస్ వీడియో వైరల్

Kavya Maran: ఇంత ఈజీ క్యాచ్ వదిలేస్తావా.. హర్షల్ పై కావ్య మారన్ సీరియస్ వీడియో వైరల్
x
Highlights

Kavya Maran : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఆటగాడు 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు....

Kavya Maran : చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఆటగాడు 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. హర్షల్ బౌలింగ్ తో కట్టడి చేయడం మూలంగానే చెన్నై జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. అయితే హర్షల్ పటేల్ కారణంగా కావ్య మారన్ చాలా నిరాశకు గురయ్యారు. కోపంతో ఊగిపోయారు. ఫీల్డింగ్ సమయంలో హర్షల్ పటేల్ చేసిన ఒక చిన్న పొరపాటు సంబరాలు చేసుకుంటున్న కావ్యను ఒక్కసారిగా బాధలో ముంచెత్తింది. అసలు హర్షల్ పటేల్ ఏమి చేశాడు? హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ అలా ఎందుకు స్పందించారు? ఈ కథనంలో తెలుసుకుందాం.

హర్షల్ పటేల్ రవీంద్ర జడేజా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మిస్ చేశాడు. 7వ ఓవర్‌లో జీషన్ అన్సారీ బౌలింగ్‌లో జడేజా ఎత్తుగా షాట్ ఆడాడు. బంతి హర్షల్ పటేల్ వద్దకు వెళ్లగా అతను చాలా తేలికైన క్యాచ్‌ను వదిలేశాడు. హర్షల్ పటేల్ చేసిన ఆ తప్పిదానికి కావ్య మారన్ తన కళ్లనే నమ్మలేకపోయింది. బంతి గాలిలో ఉండగానే వికెట్ పడుతుందని కావ్య మారన్ సంతోషంగా చప్పట్లు కొట్టింది. కానీ క్యాచ్ జారవిడవగానే ఆమె ఆనందం ఒక్కసారిగా బాధగా మారిపోయింది.

అయితే ఆ తప్పు తర్వాత హర్షల్ పటేల్ తన బౌలింగ్‌తో సత్తా చాటాడు. 8 కోట్ల రూపాయల విలువైన ఈ బౌలర్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఐదో ఓవర్‌లో హర్షల్ పటేల్‌ను బౌలింగ్‌కు దింపగా మూడో బంతికే సామ్ కర్రాన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత 13వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన హర్షల్ చెన్నై తరఫున విధ్వంసం సృష్టిస్తున్న బ్యాట్స్‌మెన్ డెవాల్డ్ బ్రెవిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బ్రెవిస్ అవుట్ అయ్యే ముందు నాలుగు సిక్సర్లు కొట్టాడు. హర్షల్ తన మూడో వికెట్‌గా ధోనీని అవుట్ చేశాడు. ఆ తర్వాత 19వ ఓవర్‌లో నూర్ అహ్మద్‌ను అవుట్ చేసి తన నాలుగు వికెట్ల కోటాను పూర్తి చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories