KL Rahul Injured : టీమిండియాకు షాక్.. బంతి తగలడంతో మైదానంలోనే కుప్పకూలిన కేఎల్ రాహుల్

KL Rahul Injured
x

KL Rahul Injured : టీమిండియాకు షాక్.. బంతి తగలడంతో మైదానంలోనే కుప్పకూలిన కేఎల్ రాహుల్

Highlights

KL Rahul Injured : టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కు ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ పెద్దగా కలిసి రాలేదు. తొలి టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన రాహుల్, రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు.

KL Rahul Injured : టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కు ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ పెద్దగా కలిసి రాలేదు. తొలి టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన రాహుల్, రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇక నాలుగో రోజు, సోమవారం (అక్టోబర్ 13) రోజున రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్‌కు ఊహించని గాయం తగిలింది. గ్రోయిన్ ప్రాంతంలో బంతి బలంగా తాకడంతో అతను నొప్పికి తట్టుకోలేకపోయాడు, మైదానంలోనే విలవిల్లాడాడు. ఈ దృశ్యం మైదానంలో ఉన్నవారితో పాటు, ప్రేక్షకులను కూడా ఆందోళనకు గురి చేసింది.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ vs వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ తర్వాత కూడా అద్భుతంగా ఆడి, భారత్‌కు 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ బ్యాటింగ్‌కు దిగగా, రెండో ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్ అవుట్ కావడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్‌పైనే అందరి దృష్టి నిలిచింది. కానీ, రాహుల్ స్కోరు చేయడానికి ముందే అతడికి పెద్ద దెబ్బ తగిలింది.

మూడో ఓవర్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ బౌలింగ్‌కు వచ్చాడు. సీల్స్ వేసిన మూడో బంతి పిచ్‌పై పడి వేగంగా లోపలికి దూసుకొచ్చింది. ఆ బంతిని రాహుల్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించినా, అది బ్యాట్‌ను తప్పించుకుని నేరుగా రాహుల్ గ్రోయిన్ ప్రాంతంలో (గజ్జల్లో) బలంగా తాకింది. రాహుల్ గ్రోయిన్ గార్డ్ ధరించినప్పటికీ, బంతి వేగం చాలా ఎక్కువగా ఉండటంతో అతను షాక్‌కు గురయ్యాడు.



బంతి తగలగానే రాహుల్ చేతి నుంచి బ్యాట్ జారిపడింది. అతను నొప్పి భరించలేక బిగ్గరగా అరిచాడు. క్రీజు నుంచి దూరంగా వెళ్ళి కింద కూర్చుండిపోయాడు. రాహుల్ నొప్పి పడుతున్న తీరు చూసి, వెంటనే టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగుపెట్టాడు. ఫిజియో కొద్దిసేపు రాహుల్‌కు చికిత్స అందించాడు, స్ప్రే చేశాడు. కొద్దిసేపు ఆట కూడా నిలిచిపోయింది.

అయినా సరే, అభిమానులకు, జట్టుకు ఊరట కలిగించే విషయం ఏంటంటే.. రాహుల్‌కు తగిలిన గాయం పెద్దది కాకపోవడం. కొద్దిసేపటి తర్వాత రాహుల్ నొప్పి నుంచి తేరుకుని తిరిగి బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాడు. ఆ తర్వాత రాహుల్, సాయి సుదర్శన్‌తో కలిసి వికెట్‌ను కాపాడుకుంటూ, జట్టు స్కోరును విజయం దిశగా నడిపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories