Mohammed Shami-BCCI: ఇది అస్సలు ఊహించలేదు.. ఆర్పీ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

Mohammed Shami-BCCI
x

Mohammed Shami-BCCI: ఇది అస్సలు ఊహించలేదు.. ఆర్పీ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

Highlights

Mohammed Shami-BCCI: సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఆడాడు. వరుస గాయాలు, ఫామ్ కోల్పోవడంతో బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు.

Mohammed Shami-BCCI: సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఆడాడు. వరుస గాయాలు, ఫామ్ కోల్పోవడంతో బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ఫిట్‌నెస్‌ సాధించినా.. అజిత్ అగార్కర్‌తో జరిగిన గొడవలతో జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా ఈ సీనియర్ పేసర్ దేశవాళీల్లో సత్తాచాటినా.. బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది. షమీని తొలగించడంపై మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

మహ్మద్ షమీని మళ్లీ టీమిండియాలోకి తీసుకురావాలనే ఆలోచన తనకు ఉందని, అయితే బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించిందని ఆర్పీ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారు. 'మహమ్మద్ షమీని తిరిగి భారత జట్టులోకి తీసుకురావాలని నేను ఆలోచించాను. కానీ బీసీసీఐ అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తొలగించింది' అంటూ ఆర్పీ సింగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలతో సెలెక్షన్ విధానం, సీనియర్లపై బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహ్మద్ షమీ ఫామ్‌పై మాత్రం ఎలాంటి సందేహం లేదని ఆర్పీ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడని.. దేశవాళీ క్రికెట్‌లో తన అనుభవం, నైపుణ్యంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు గట్టి సవాల్ విసురుతున్నాడని అన్నారు. జాతీయ జట్టుకు అవసరమైన అనుభవం షమీ వద్ద పుష్కలంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కీలక పాత్ర పోషించిన షమీ.. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై తన స్వింగ్, సీమ్ బౌలింగ్‌తో అనేక విజయాల్లో భాగస్వామి అయ్యాడు. అలాంటి బౌలర్‌ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడం సరైన నిర్ణయమా అనే చర్చలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి.

ఆర్పీ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో మహ్మద్ షమీకి మళ్లీ భారత జట్టులో అవకాశం దక్కుతుందా? లేదా దేశవాళీ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడా? అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ అంశం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ డిబేట్‌గా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించిన షమీ.. తన స్వగ్రామంలో టెన్నిస్-బాల్ క్రికెట్ ఆడడం నుంచిటీమిండియా ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా మారడం అతని అంకితభావానికి, సహజ నైపుణ్యానికి నిదర్శనం. షమీ భారత్ తరఫున 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories