MS Dhoni: రిటైర్‌మెంట్ పై స్పందించిన ధోని.. విరాట్‌లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయ్..!

MS Dhoni: రిటైర్‌మెంట్ పై స్పందించిన ధోని.. విరాట్‌లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయ్..!
x
Highlights

MS Dhoni: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా సమయమున్నా, ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ ఎంఎస్ ధోనీ చుట్టూనే తిరుగుతోంది.

MS Dhoni: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా సమయమున్నా, ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చ ఎంఎస్ ధోనీ చుట్టూనే తిరుగుతోంది. సీఎస్‌కే (చెన్నై సూపర్ కింగ్స్‌) మాజీ కెప్టెన్ ధోనీ మళ్లీ ఆడతాడా? అనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. గత ఐపీఎల్ ముగిసి మూడు నెలలే గడిచినా, ధోనీ నిర్ణయం గురించి ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి.

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ, తన భవిష్యత్ ప్రణాళికలపై స్పందించాడు. ‘‘వచ్చే సీజన్‌లో నేను ఆడతానా? లేదా? అన్న దానిపై ఇప్పుడే చెప్పలేను. అయితే, చెన్నై జట్టుతో నా అనుబంధం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. ఇది మరో 15 లేదా 20 సంవత్సరాలైనా ఉండొచ్చు. నేను మళ్లీ పసుపు జెర్సీలోకి వస్తానా? అంటే.. ఎల్లప్పుడూ అదే జెర్సీలో ఉన్నట్టే ఉంటుంది’’ అని ధోనీ వ్యాఖ్యానించాడు.

అలాగే అభిమానులు చెబుతున్న ‘‘ధోనీ లేకపోతే సీఎస్‌కే కాదు’’ అన్న మాటలపై స్పందిస్తూ, ‘‘అలాంటి వ్యాఖ్యలు విని ఆనందంగా ఉంది. కానీ జట్టు ఎదుగుదల వ్యక్తుల కంటే ఎక్కువ. నేను ఆడకపోయినా జట్టుతో నా అనుబంధం కొనసాగుతుంది’’ అని ధోనీ తెలిపాడు.

ఇదే కార్యక్రమంలో, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కూడా ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ మంచి గాయకుడు, మంచి నర్తకుడు. మిమిక్రీ కూడా బాగా చేస్తాడు. చాలా సరదాగా ఉంటాడు. అందుకే అతన్ని మంచి ఎంటర్‌టైనర్‌గా చెప్పొచ్చు’’ అంటూ ధోనీ కొనియాడాడు.

ధోనీ వ్యాఖ్యలు మరోసారి అభిమానుల గుండెల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆయన ప్రాధాన్యతను గుర్తు చేశాయి. అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడా? అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ మిగిలే ఉంది!


Show Full Article
Print Article
Next Story
More Stories