MS Dhoni IPL Retirement: ధోనీ రిటైర్‌మెంట్‌ ఫిక్స్? సంచలనం రేపుతున్న వార్తలు!

MS Dhoni IPL Retirement
x

MS Dhoni IPL Retirement: ధోనీ రిటైర్‌మెంట్‌ ఫిక్స్? సంచలనం రేపుతున్న వార్తలు!

Highlights

MS Dhoni IPL Retirement: రిటైర్మెంట్ వార్తలు ఫేక్ అనిపించినా, ఫినిషింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ సీజన్ తర్వాత ధోని భవిష్యత్తుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.

MS Dhoni IPL Retirement: చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ఎంఎస్ ధోని తాజాగా సోషల్ మీడియాలో మరింత చర్చకు కారణం అయ్యాడు. కానీ ఈసారి కారణాలు ఫ్యాన్స్ కోరుకున్న విధంగా లేదు. ఐపీఎల్ 2025లో రెండు మ్యాచ్‌ల్లోనూ ధోని కీలక సమయంలో బరిలోకి వచ్చి ఫినిష్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో ధోనిపై నిపుణులూ, అభిమానులూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక అక్టోబర్ ఫూల్ సందర్భంగా ధోని రిటైర్మెంట్ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. కొన్ని ఫేక్ పోస్టులు "తల" తక్షణమే రిటైర్ అయ్యాడని ప్రస్తావించాయి. కానీ వాటన్నీ మోసపూరితమైనవే. ప్రస్తుతం ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించలేదు. అంటే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికీ అతడి ఆటను అభిమానులు ఎంజాయ్ చేయవచ్చు.

అయితే, ఐపీఎల్ 2025లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ స్పష్టంగా ప్రశ్నార్థకంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నా ధోని బ్యాటింగ్‌కు రావడం ఆలస్యమైంది. అశ్విన్‌ను ముందుగా పంపిన నిర్ణయం విమర్శల పాలు అయింది. అదే విధంగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లోనూ ధోని ఏడో స్థానంలో వచ్చి మ్యాచును ఫినిష్ చేయలేకపోయాడు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, ధోని ఈ సీజన్ తర్వాత బ్యాట్ను తేలేస్తాడా అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. కానీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories