MS Dhoni: ఫామ్ లేని ధోనీ ఇంకా ఎందుకు ఆడుతున్నాడు? మాజీ క్రికెటర్ల విమర్శలు!

MS Dhoni
x

MS Dhoni: ఫామ్ లేని ధోనీ ఇంకా ఎందుకు ఆడుతున్నాడు? మాజీ క్రికెటర్ల విమర్శలు!

Highlights

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. దీనికి కారణం అతని ప్రస్తుత ఆటతీరు. ధోనీ పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు.

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం ప్రశ్నల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. దీనికి కారణం అతని ప్రస్తుత ఆటతీరు. ధోనీ పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. మ్యాచ్‌ను ముగించడంలోనూ మునుపటిలా కనిపించడం లేదు. జట్టు విజయవంతంగా ఛేదించే లక్ష్యాలలో అతని సహకారం నామమాత్రంగానే ఉంటోంది. ఇది కేవలం ఐపీఎల్ 2025 గురించే కాదు, గత సీజన్‌లోనూ అతని పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విఫలమవుతున్న ధోనీపై విమర్శలు గుప్పించాడు. పరోక్షంగా ధోనీ సీఎస్‌కేతో ఆటలాడుకుంటున్నాడని ఆరోపించాడు. దేశీయ క్రికెట్‌లో బెంగాల్ తరపున ఆడే మనోజ్ తివారీ కొద్దికాలం క్రితం ధోనీ తన కెరీర్‌ను నాశనం చేశాడని పెద్ద ఆరోపణ కూడా చేశాడు.

క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ మనోజ్ తివారీ.. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచినప్పుడే ధోనీ రిటైర్ అయి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. అలా చేయకపోవడం వల్ల ధోనీ సంపాదించిన గౌరవం లేదా అభిమానుల నమ్మకం గత సీజన్ నుండి సడలిందని, అభిమానులు అతని నుండి ఎలాంటి ప్రదర్శనను ఆశిస్తున్నారో అతను ఇప్పుడు అలా చేయలేకపోతున్నాడని అన్నాడు.

స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇచ్చిన ఒక ప్రకటనపై కూడా మనోజ్ తివారీ విరుచుకుపడ్డాడు. ధోనీ 10 ఓవర్ల కంటే ఎక్కువ బ్యాటింగ్ చేయలేడని, పరిగెత్తలేడని ఫ్లెమింగ్ చెప్పాడు. దీనిపై తివారీ మాట్లాడుతూ, 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయడానికి, స్టంపింగ్ చేయడానికి, బంతిని ఆపడానికి డైవ్ చేయడానికి మీ మోకాలికి గాయం అవ్వదు కానీ, జట్టును గెలిపించే సమయానికి మోకాలి నొప్పి అడ్డు వస్తుందంటే తన బుర్రకు ఎక్కడం లేదని అన్నాడు.

మనోజ్ తివారీ ప్రకారం ధోనీ ఇక తన వల్ల కావడం లేదని ఎవరికైనా చెప్పాలి. ఇప్పుడు అతను రిటైర్ అవ్వాలి. సీఎస్‌కే అన్ని నిర్ణయాలు ఎంఎస్ ధోనీనే తీసుకుంటున్నాడని, కానీ అతను తీసుకుంటున్న నిర్ణయాలు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా లేవని కూడా తివారీ విమర్శించాడు.

రిటైర్ అవ్వకుండా సీఎస్‌కేతో ఆటలాడుకుంటున్నాడని ఆరోపించిన మనోజ్ తివారీ గతంలో ధోనీ తన కెరీర్‌ను నాశనం చేశాడని కూడా ఆరోపించాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని, కానీ ఇవ్వలేదని తివారీ అన్నాడు. సెంచరీ చేసినప్పటికీ తనను జట్టు నుండి తప్పించారని అదే సమయంలో పరుగులు చేయని విరాట్, రైనా, రోహిత్‌లను జట్టులో కొనసాగించారని తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరు నెలల వ్యవధిలో తాను 14 మ్యాచ్‌లకు దూరంగా ఉన్నానని తివారీ గుర్తు చేసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories