
Nepal vs Italy: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో పసికూన ఇటలీ శుభారంభం చేసింది. గ్రూప్-సిలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
Nepal vs Italy: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో పసికూన ఇటలీ శుభారంభం చేసింది. గ్రూప్-సిలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇటలీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 12.4 ఓవర్లలోనే 124 రన్స్ చేసి ఊహించని విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ఇటలీ ఖాతాలో 2 పాయింట్స్ చేరాయి. మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఓడిపోయింది.
ఇటలీ విజయంలో ఓపెనర్లు జస్టిన్ మోస్కా, ఆంథోనీ మోస్కా కీలక పాత్ర పోషించారు. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆంథోనీ మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 62 పరుగులు చేసి జట్టును సునాయాసంగా విజయ తీర్లకు చేర్చాడు. ఇద్దరూ కలిసి నేపాల్ బౌలర్లను ఓ అట్టడుకున్నారు. 124 పరుగుల పార్ట్నర్షిప్తో ఔరా అనిపించారు. నేపాల్ బౌలర్ లలిత్ రాజ్‌బన్షి ఒక ఓవర్లో 19 రన్స్ ఇచ్చాడు. స్టార్ బౌలర్ సందీప్ లామిచానే మూడు ఓవర్లలో 31 రన్స్ సమర్పించుకున్నాడు. దీపేంద్ర సింగ్ ఐరీ, కుషాల్ భూర్తెల్ మాత్రం కాస్త ఆకట్టుకున్నారు.
ఇక నేపాల్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసి 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ పౌడెల్ 23, ఆసిఫ్ షేక్ 20, కరణ్ కేసీ 18 నాటౌట్, దీపేంద్ర సింగ్ 17 పరుగులు చేశారు. ఒక దశలో 93/3తో మంచి స్థితిలో ఉన్న నేపాల్.. ఆ తర్వాత కేవలం 30 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ఇటలీ బౌలర్లలో క్రిషన్ మూడు వికెట్లు పడగొట్టగా.. బెన్ మన్నెంటి రెండు వికెట్లు తీశాడు. అలీ హసన్, స్మట్స్, జస్ప్రీత్ సింగ్ తలా ఒక వికెట్ తీసి నేపాల్ పతనాన్ని వేగవంతం చేశారు. ఈ విజయంతో ఇటలీ టోర్నీలో బోణీ కొట్టగా.. నేపాల్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో నేపాల్ సూపర్ 8 దారులు దాదాపుగా మూసుకుపోయినట్లే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




