Video Viral: స్టార్ ప్లేయర్ కంటికి తగిలిన బంతి.. తీవ్ర రక్తస్రావం.. వీడియో వైరల్

Video Viral: స్టార్ ప్లేయర్ కంటికి తగిలిన బంతి.. తీవ్ర రక్తస్రావం.. వీడియో వైరల్
x
Highlights

Video Viral: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇప్పుడు ఎంతో దూరంలో లేదు.. కానీ కొన్ని జట్ల టెన్షన్ కు మాత్రం ఎండ్ కార్డ్ పడడం లేదు.

Video Viral: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇప్పుడు ఎంతో దూరంలో లేదు.. కానీ కొన్ని జట్ల టెన్షన్ కు మాత్రం ఎండ్ కార్డ్ పడడం లేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్లకు గాయాలతో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టారు. తాజాగా యువ ఆల్ రౌండర్ రాచిన్ రవీంద్రకు మైదానంలో పెను ప్రమాదం జరిగింది. పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా రవీంద్రకు ఈ ఘటన జరిగింది. ఆ మ్యాచ్‌లో బంతి అతని కంటికి తగిలి రక్తం కారింది.

లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మూడు దేశాల మధ్య జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 8వ తేదీ శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించినందుకు రచిన్ రవీంద్ర పెను ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన 38వ ఓవర్లో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుండగా జరిగింది. స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్ చేస్తుండగా ఖుస్దిల్ షా పాకిస్తాన్ తరపున బ్యాటింగ్ చేస్తున్నాడు.

పాకిస్తాన్ జట్టు 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారికి భారీ షాట్లు అవసరం అయ్యాయి. బ్రేస్‌వెల్ వేసిన ఓవర్‌లోని మూడో బంతికి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఖుష్దిల్ స్లాగ్ స్వీప్ ఆడాడు కానీ డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న రాచిన్ దానిని క్యాచ్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్యాచ్‌ను అతను పట్టుకుంటాడని అందరూ అనుకున్నారు కానీ బహుశా స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల కారణంగా అతను బంతిని చూడలేకపోయాడు. దానిని పట్టుకునే క్రమంలో బంతి ఎడమ కన్ను దగ్గర నేరుగా తాకింది. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతని కంటి నుండి రక్తం కారింది.

ఈ భయానక దృశ్యాన్ని చూసి స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ భయపడ్డారు. వైద్య బృందం వెంటనే మైదానానికి చేరుకుంది . రాచిన్‌ను కొంతసేపు గమనించిన తర్వాత, అతన్ని మైదానం నుండి బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమయంలో రక్తస్రావం ఆపడానికి అతని ముఖం మీద పెద్ద టవల్ కప్పి ఉంచారు. దీని తరువాత రాచిన్ తిరిగి మైదానంలోకి రాలేదు. ప్రస్తుతం అతని పరిస్థితి గురించి న్యూజిలాండ్ క్రికెట్ ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి అతను ఫిట్ అవుతాడా లేదా అని కివీస్ జట్టు ఆందోళన చెందుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories