Paralympics 2024: పారాలింపిక్స్‌లో మరో స్వర్ణం.. భారత అథ్లెట్ నవదీప్ అరుదైన ఘనత


Paralympics 2024: పారాలింపిక్స్‌లో మరో స్వర్ణం.. భారత అథ్లెట్ నవదీప్ అరుదైన ఘనత
Paralympics 2024: జావెలిన్ త్రో ఎఫ్-41లో భారత్‌కు గోల్డ్ మెడల్
Paralympics 2024: పారిస్ పారా ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. జావెలిన్ త్రో ఎఫ్-41లో అనూహ్యంగా గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-41లో నవదీప్ స్వర్ణం దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో ఎఫ్-41లో ముందు ఇరాన్ అథ్లెట్ స్వర్ణం దక్కించుకోగా..భారత అథ్లెట్ నవదీప్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్ పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్-41 లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire