NZ vs PAK Weather Update: మ్యాచ్‌కు వరణుడి గండం.. పాకిస్థాన్‌ సెమీస్ ఆశలు గల్లంతేనా?

NZ vs PAK Weather Update: మ్యాచ్‌కు వరణుడి గండం.. పాకిస్థాన్‌ సెమీస్ ఆశలు గల్లంతేనా?
x

NZ vs PAK Weather Update: మ్యాచ్‌కు వరణుడి గండం.. పాకిస్థాన్‌ సెమీస్ ఆశలు గల్లంతేనా?

Highlights

వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే పాయింట్ల లెక్కలు మారే అవకాశం… పాకిస్థాన్‌ సెమీస్ అవకాశాలు పూర్తిగా వాతావరణంపై ఆధారపడే పరిస్థితి!

భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్నా టీ20 ప్రపంచకప్‌ 2026లో ఈరోజు నుంచి సూపర్‌-8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. నేడు కొలంబో వేదికగా పాకిస్తాన్, న్యూజీలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. సూపర్‌-8 మ్యాచ్ కాబట్టి లీగ్‌ దశలో గ్రూప్‌-ఎ, డిల నుంచి రెండో స్థానంతో ముందంజ వేసిన పాక్, కివీస్ టీమ్స్ విజయం కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. గ్రూప్‌ దశలో భారత్‌పై పాక్, దక్షిణాఫ్రికాపై కివీస్ ఓడాయి. సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.

రాత్రి 7 గంటలకు ఆరంభం అయ్యే పాకిస్తాన్, న్యూజీలాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. బీబీసీ వెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం 70 శాతం నుంచి 80 శాతం వరకు ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు ఎంతో కీలకం. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి పాక్ సూపర్‌-8కు చేరింది. శ్రీలంకలో ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పాక్ తన ప్రాక్టీస్ సెషన్‌ను కూడా వర్షం కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్‌-8 మ్యాచులకు ఎటువంటి రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా పాకిస్తాన్, న్యూజీలాండ్ మ్యాచ్ రద్దైతే.. ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ కేటాయిస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంటేనే పాయింట్లు పంచుతారు. పాయింట్లు పంచుకోవడం వల్ల సెమీఫైనల్ రేసులో ఉన్న పాకిస్థాన్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే తదుపరి మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంక వంటి బలమైన జట్లను పాక్ తప్పనిసరిగా ఓడించాల్సి ఉంటుంది. శ్రీలంక మంచి ఫేమ్ మీదుంది. కాబట్టి లంకను ఓడించడం అంత తేలికేం కాదు. ఇంగ్లాండ్ కూడా హిట్టర్లతో నిండి ఉంది. సూపర్‌-8లో రెండు మ్యాచులు గెలిస్తేనే.. సెమీస్ అవకాశం ఉంటుంది. చూడాలి మరి నేటి మ్యాచ్‌కు వరణుడి సహకరిస్తాడో లేదో.

Show Full Article
Print Article
Next Story
More Stories