Champions Trophy 2025: పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లకు సైన్యం భద్రత.. క్రికెట్ ప్రియుల్లో ఆందోళన

Pakistan Deploys Army for Security Ahead of Champions Trophy 2025 Amid Rising Tensions
x

Champions Trophy 2025: పాకిస్తాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లకు సైన్యం భద్రత.. క్రికెట్ ప్రియుల్లో ఆందోళన

Highlights

Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్‌లో ప్రారంభం కానుంది.

Champions Trophy: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్‌లో ప్రారంభం కానుంది. కానీ ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు పాకిస్తాన్‌లో భద్రత పరంగా పరిస్థితులు మరింత క్షీణించాయి. దీంతో పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించి కఠిన భద్రతను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

ముక్కోణపు సిరీస్‌కు సైన్యం, రేంజర్ల భద్రత

పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైన్యాన్ని మోహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ ఆర్మీ, రేంజర్స్ కంపెనీ భద్రత కల్పించనున్నాయి. స్థానిక పోలీసు అధికారులు సైన్యాన్ని మోహరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

ట్రై-సిరీస్ షెడ్యూల్

ట్రై-సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 14న ఫైనల్‌తో ముగుస్తుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఈ సిరీస్‌లో భాగంగా ఉంటాయి.

* ఫిబ్రవరి 8: న్యూజిలాండ్ vs పాకిస్తాన్ మ్యాచ్ – లాహోర్‌లోని గడాఫీ స్టేడియం

* ఫిబ్రవరి 10: న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ – లాహోర్

* ఫిబ్రవరి 12: పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్ – కరాచీ

* ఫిబ్రవరి 14: ఫైనల్ మ్యాచ్ – కరాచీ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్

ట్రై-సిరీస్ అనంతరం, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఐసీసీ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 19న కరాచీలో ప్రారంభమై మార్చి 9న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది.

* ఫిబ్రవరి 19: పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ (కరాచీ)

* ఫిబ్రవరి 23: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ (దుబాయ్)

భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తన ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. విశేషం ఏమిటంటే, టీం ఇండియా ఫైనల్స్ లేదా సెమీస్ చేరితే మాత్రమే ఆ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. లేదంటే, అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే జరగనున్నాయి.

భద్రతా ఏర్పాట్లు – క్రికెట్ పై ప్రభావం

పాకిస్తాన్‌లో నెలకొన్న భద్రతా సమస్యల కారణంగా ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆటగాళ్ల రక్షణ కోసం సైన్యాన్ని మోహరించడం అత్యవసరం అయ్యింది. భారత జట్టు మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహించడం వెనుక ప్రధాన కారణం కూడా భద్రతా పరమైన సమస్యలేననే విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో, టీం ఇండియా అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.

పాకిస్తాన్‌లో తలెత్తిన ఈ పరిణామాలతో క్రికెట్ ప్రేమికులు భద్రతా పరమైన అంశాలపై ఆందోళన చెందుతున్నారు. ఐసీసీ, పీసీబీ, ఇతర క్రికెట్ బోర్డులు ఈ సమస్యను సకాలంలో పరిష్కరించడంలో ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories