PSL Auction 2026: ఐపీఎల్ ముందు పీఎస్‌ఎల్ జుజుబి.. ఒక్క టీమ్ బ్రాండ్ వ్యాల్యూతో మొత్తం కొనేయొచ్చు!

PSL Auction 2026
x

PSL Auction 2026: ఐపీఎల్ ముందు పీఎస్‌ఎల్ జుజుబి.. ఒక్క టీమ్ బ్రాండ్ వ్యాల్యూతో మొత్తం కొనేయొచ్చు!

Highlights

PSL Auction 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 వేలం క్రికెట్ ప్రపంచంలో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీసింది.

PSL Auction 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 వేలం క్రికెట్ ప్రపంచంలో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీసింది. పదకొండవ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం 2026 ఫిబ్రవరి 11న జరగనుంది. ప్లేయర్స్ వేలానికి రెండు రోజుల ముందు.. సోమవారం జరిగిన పీఎస్‌ఎల్ వేలంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు 2.45 బిలియన్లకు అమ్ముడైంది. ఈ ఫ్రాంచైజీని వలీ టెక్నాలజీస్ (Walee Technologies) కొనుగోలు చేయడం విశేషం. ముల్తాన్ సుల్తాన్స్ అమ్మకం తర్వాత పీఎస్‌ఎల్ మొత్తం బ్రాండ్ విలువపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ప్రస్తుతం పీఎస్‌ఎల్ బ్రాండ్ విలువ సుమారు 156 నుంచి 200 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది పాకిస్తాన్ క్రికెట్‌కు ఒక మైలురాయిగా భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోల్చుతున్నారు. ఐపీఎల్‌ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్రాండ్ విలువే దాదాపు 269 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఐపీఎల్‌లో ఒక్క ఫ్రాంచైజీ విలువతోనే దాదాపు మొత్తం పీఎస్‌ఎల్ లీగ్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ గణాంకాలు చూస్తే.. ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్, స్పాన్సర్‌షిప్స్, టీవీ రైట్స్ ఎంత భారీగా ఉన్నాయో ఇట్టే స్పష్టమవుతోంది. మరోవైపు పీఎస్‌ఎల్ కూడా తన స్థాయిలో ఎదుగుతున్నప్పటికీ.. ఐపీఎల్‌తో పోలిస్తే బ్రాండ్ వ్యాల్యూలో భారీ తేడా ఉందన్న విషయం మరోసారి బయటపడింది. మొత్తంగా చూస్తే.. ముల్తాన్ సుల్తాన్స్ అమ్మకం పీఎస్‌ఎల్‌కు పెద్ద అప్‌డేట్ అయినా.. ఐపీఎల్–పీఎస్‌ఎల్ మధ్య ఉన్న ఆర్థిక అంతరం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే అంశం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

పీఎస్‌ఎల్ 2026 వేలం ఫిబ్రవరి 11న జరగనుంది. మార్చి 26 నుంచి మే 3 వరకు మ్యాచులు జరుగుతాయి. 2026లో హైదరాబాద్, సియాల్‌కోట్‌తో సహా ఎనిమిది జట్లు పాల్గొంటాయి. 2016లో ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా పీఎస్‌ఎల్ డ్రాఫ్ట్ వ్యవస్థను పక్కనపెట్టి పూర్తి స్థాయి ఆటగాళ్ల వేలానికి వెళుతుంది. ఈసారి రెండు కొత్త జట్లు ఎంటర్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories