క్వార్టర్ ఫైనల్‌కు పీవీ సింధు, ప్రణయ్.. మలేషియా ఓపెన్‌‌‌లో మనోళ్ల హవా...

Malaysia Open-2022: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియా ఓపెన్‌లో దూసుకుపోతోంది.

Arun Chilukuri
Published on: 30 Jun 2022 8:23 PM IST
Malaysia Open-2022, Badminton, HS Prannoy, Pv sindhu, Sports news
X

క్వార్టర్ ఫైనల్‌కు పీవీ సింధు, ప్రణయ్.. మలేషియా ఓపెన్‌‌‌లో మనోళ్ల హవా...

Malaysia Open-2022: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియా ఓపెన్‌లో దూసుకుపోతోంది. ప్రీ క్వార్టర్స్‌లో సింధు థాయ్‌లాండ్ ప్లేయర్ ఫిట్టయాపోర్న్ పై విజయం సాధించింది. మొత్తం 57 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు ఫస్ట్ గేమ్‌ను 19-21తో కోల్పోయింది. అయితే రెండో గేమ్‌ను 21-9 గెలుచుకుంది. ఇదే జోరును కొనసాగించిన సింధు, నిర్ణయాత్మక గేమ్‌లోనూ సూపర్ స్మాష్‌లు, షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే క్రమంలో 21-14తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

అటు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ ప్రణయ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరకున్నాడు. ప్రీ క్వార్టర్‌లో నాలుగో సీడ్ చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌పై 21-15, 21-7 తేడాతో సునాయాసంగా విజయం సాధించాడు. ఇక మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి షట్లర్ పారుపల్లి కశ్యప్ వైదొలిగాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story