Quinton de Kock: డికాక్‌కు కలిసిరాని కోల్‌కతా.. గణాంకాలు చూస్తే మైండ్ బ్లాకే!

Quinton de Kock
x

Quinton de Kock: డికాక్‌కు కలిసిరాని కోల్‌కతా.. గణాంకాలు చూస్తే మైండ్ బ్లాకే!

Highlights

Quinton de Kock: డికాక్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ అంటే మాత్రం బెంబేలెత్తిపోతున్నాడు. కోల్‌కతా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ వేదికపై అతని గణాంకాలు చూస్తే.. ఇలా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

Quinton de Kock: టీ20 క్రికెట్‌లో విధ్వంసకర ఓపెనర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్‌కు పేరుంది. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డికాక్ ధాటిగా ఆడుతుంటాడు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తుంటాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ.. బౌలర్లను ఒత్తిడికి గూరి చేస్తుంటాడు. అలాంటి డికాక్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ అంటే మాత్రం బెంబేలెత్తిపోతున్నాడు. కోల్‌కతా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ వేదికపై అతని గణాంకాలు చూస్తే.. ఇలా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

ఇప్పటివరకు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 10 ఇన్నింగ్స్ ఆడిన డికాక్.. కేవలం 95 పరుగులే చేశాడు. అతడి సగటు 9.5 మాత్రమే ఉండగా.. స్ట్రైక్ రేట్ 110.46గా నమోదైంది. డికాక్ అత్యధిక స్కోరు కేవలం 28 పరుగులే కావడం గమనార్హం. ఈ నిరాశాజనక రికార్డు మధ్య మరోసారి అతడు తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ పార్ట్‌టైమ్ బౌలర్ కోల్ మెక్‌కాంచీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ దిశను మార్చేశాడు. వరుస బంతుల్లోనే డి కాక్‌తో పాటు రయన్ రికెల్టన్‌ను కూడా ఔట్ చేసి సఫారీ జట్టుకు గట్టి దెబ్బకొట్టాడు. ముఖ్యంగా డి కాక్ వికెట్ కీలక సమయంలో పడటం మ్యాచ్‌పై భారీ ప్రభావం చూపింది. అనుభవజ్ఞుడైన ఓపెనర్‌గా జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాల్సిన సమయంలో మరోసారి విఫలమవ్వడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇక రికెల్టన్ కూడా వెంటనే వెనుదిరగడంతో జట్టు ఒత్తిడిలో పడింది.

మొత్తంగా చూస్తే ఈడెన్ గార్డెన్స్ మైదానం డి కాక్‌కు ఇంకా సవాలుగానే మిగిలింది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో కూడా అతని నిరాశాజనక రికార్డు కొనసాగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డికాక్ రిటైర్మెంట్ ఇచ్చి మరీ.. తన నిర్ణయాన్ని మరలా వెనక్కి తీసుకున్నాడు. రే ఎంట్రీలో డికాక్ అప్పుడప్పుడు తప్పితే పెద్దగా రాణించడం లేదు. కీలక సెమీ ఫైనల్లో కూడా విఫలమయ్యాడు. డికాక్ తక్కువ స్కోరుకే పరిమితం అవ్వడంతో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ప్రభావం పడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో యాన్సెన్ (55) హాఫ్ సెంచరీ బాదాడు. డేవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) ఫర్వాలేదనిపించారు. ఐడెన్ మార్‌క్రమ్ (18), క్వింటన్ డికాక్ (10) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. రికెల్టన్ (0), డేవిడ్ మిల్లర్ (6), కార్బిన్ బాష్‌ (2) పూర్తిగా విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో హెన్రీ 2, మెక్‌కాంచి 2, రచిన్ రవీంద్ర 2 రెండు వికెట్స్ పడగొట్టారు. చేధనలో కివీస్ లక్ష్యం దిశగా దూసుకెళుతోంది. 11 ఓవర్లలో 137 రన్స్ చేసింది. 52 బంతుల్లో 33 రన్స్ చేస్తే కివీస్ ఫైనల్ చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories