IPL 2025: స్లో ఓవర్ రేట్ ఉల్లంఘన: హార్దిక్ పాండ్యా తర్వాత రియాన్ పరాగ్‌కు ఫైన్

Rajasthan Royals Captain Riyan Parag Fined for Slow Over Rate
x

IPL 2025: స్లో ఓవర్ రేట్ ఉల్లంఘన: హార్దిక్ పాండ్యా తర్వాత రియాన్ పరాగ్‌కు ఫైన్

Highlights

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు.

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు. ఐపీఎల్ 2025లో స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్షకు గురైన రెండో కెప్టెన్ రియాన్ పరాగ్. అతని కంటే ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే కారణంతో జరిమానా ఎదుర్కొన్నాడు. CSKతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ జట్ల కెప్టెన్‌లు చెల్లించాల్సిన మొత్తం ఇది.

ఐపీఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, స్లో ఓవర్ రేట్‌కు సంబంధించి రియాన్ పరాగ్ జట్టు చేసిన మొదటి తప్పు ఇది కాబట్టి, ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సెక్షన్ 2.22 ప్రకారం అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించామని పేర్కొంది. రియాన్ పరాగ్ కంటే ముందు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక మ్యాచ్ నిషేధం తర్వాత తిరిగి వచ్చాడు. ఆ నిషేధం కూడా స్లో ఓవర్ రేట్ కారణంగానే విధించబడింది. వాస్తవానికి, ఒక సీజన్‌లో ఒక కెప్టెన్ మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే, అతనికి ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు.

రియాన్ పరాగ్ విషయానికొస్తే, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండూ అద్భుతంగా సాగాయి. ధోని కోసం అతను స్పిన్నర్ల ఓవర్లను ఆదా చేసిన విధానం, కెప్టెన్‌గా అతని ఆ నిర్ణయానికి మంచి ప్రశంసలు లభించాయి. అలాగే బ్యాటింగ్‌లో అతను 28 బంతుల్లో 37 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగుల దూరంలో ఆగిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్‌లో CSK విజయానికి 19 పరుగులు అవసరం కాగా, ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ దానిని సమర్థవంతంగా అడ్డుకొని తన జట్టుకు విజయాన్ని అందించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories