RCB on Sale: అమ్మకానికి రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు..

RCB on Sale: అమ్మకానికి రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు..
x

RCB on Sale: అమ్మకానికి రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు..

Highlights

RCB on Sale: ఐపీఎల్ టైటిల్ ను తొలిసారి గెలిచి ట్రోఫీ కలను నెరవేర్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు.

RCB on Sale: ఐపీఎల్ టైటిల్ ను తొలిసారి గెలిచి ట్రోఫీ కలను నెరవేర్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును అధికారికంగా అమ్మకానికి పెట్టారు. ఐపీఎల్ మెన్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత యజమానులైన డియాజియో ఇప్పటికే అమ్మక ప్రక్రియను ప్రారంభించింది. 2026 మార్చి 31 నాటికి అమ్మకాన్ని పూర్తి చేయగలమని నమ్మకంతో ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత ఐపీఎల్ లో RCB కనిపించదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓనర్లు ఆర్సీబీ జట్టును సేల్ కు పెట్టిన వార్తలు నిజమే అయినట్టు తెలుస్తోంది. బయ్యర్ దొరికితే మార్చి 31, 2026 నాటికి ఆర్సీబీ పేరు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆర్సీబీ బ్రాండ్ వ్యాల్యూ 2వేల 247 కోట్లు. ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు పలువురు బడా వ్యాపార వేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. USలోని ఒక ప్రైవేట్ పెట్టుబడి సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. JSW గ్రూప్ కూడా రేస్ లో ఉంది. అదానీ గ్రూప్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన అదార్ పూనవాలా, దేవయాని ఇంటర్నేషనల్ గ్రూప్ కు చెందిన రవి జైపురియా కూడా RCBని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.

మార్చి 31 నాటికి ఆర్సీబీ జట్ల అమ్మకం పూర్తయితే మరో పేరుతో ఆర్సీబీ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. 2008 నుండి ఐపీఎల్ లో భాగమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలిసారి టైటిల్ గెలుచుకుంది. మహిళల్లో 2024 ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నారు. విరాట్ కోహ్లీ, స్మృతి మంధాన, జోష్ హాజిల్ వుడ్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories