RR vs CSK: ధోనీకి ప్రత్యర్థి జట్టు ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది మరి... వీడియో వైరల్

RR players seen removing their caps before greeting MS Dhoni after RR vs CSK match finished
x

Viral video: ధోనీకి ప్రత్యర్థి జట్టు ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది మరి... వీడియో వైరల్

Highlights

RR players' respect for MS Dhoni despite of CSK's loss: ధోనీ... అది అంతర్జాతీయ క్రికెట్ అయినా, లేదా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ అయినా... అక్కడ ధోనీ...

RR players' respect for MS Dhoni despite of CSK's loss: ధోనీ... అది అంతర్జాతీయ క్రికెట్ అయినా, లేదా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ అయినా... అక్కడ ధోనీ ఉన్నాడంటే ఆయనకు ప్రత్యర్థులు ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఆదివారం గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన మ్యాచ్‌లోనూ అలాంటి దృశ్యమే కనిపించిందని ధోనీ ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రస్తుతం ధోనీ వయస్సు 43 ఏళ్లు. ధోనీకి వయసుతో పాటే ఆయనపై క్రికెటర్లలో గౌరవం కూడా పెరుగుతోంది. ఒకప్పుడు ధోనీ మైదానంలో ఉన్నాడంటే ఆ ఇంపాక్టే వేరుగా ఉండేది. ఇప్పుడు ఆ ఇంప్యాక్ట్ కనిపించకపోయినా ఆయన మైదానంలో ఉంటే కనిపించే క్రేజ్ మాత్రం అలానే ఉంది.

ఆదివారం నాటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టేన్ అయిన రియాన్ పరాగ్ అస్సాం వాసి. ప్రత్యర్థి జట్టులో ఉన్న ధోనీ స్థానికుడు కాకపోయినా స్థానికుడైన రియాన్ పరాగ్ కంటే దోనీకే ఎక్కువ క్రేజ్ కనిపించిందనే టాక్ వినిపించింది.

మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు మైదానంలో ధోనికి అభివాదం చేసేందుకు వచ్చారు. ఒక్కొక్కరిగా ధోనీని విష్ చేస్తూ అంతకంటే ముందుగా వారు తమ తలపై ఉన్న క్యాప్స్ తీస్తూ కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ధోనికి వారు ఇచ్చిన గౌరవం అంటూ నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుండి కూడా అంతే గౌరవ మర్యాదలు అందుకునే ఏకైక క్రికెట్ లెజెండ్ అంటూ ధోనీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి కూల్ కేప్టేన్ అనే పేరు ఊరికే వస్తుందా అని ఇంకొంతమంది నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు.

బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ధోనీపై విమర్శలు

అందరి చేత గౌరవ మర్యాదలు అందుకునే ధోనీ ఒక్క విషయంలో మాత్రం ప్రస్తుతం విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అదే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ధోనీ ఎందుకు ముందుగా బ్యాటింగ్‌కు దిగడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గత వారం రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో చపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ధోనీ 9వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు రావడం అభిమానులకు అసలే నచ్చలేదు.

ఆ విమర్శలు అలా ఉండగానే ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి ధోనీ 7వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికి చెన్నై విజయం కోసం 25 బంతుల్లో 54 పరుగులు కావాల్సి ఉంది. ధోనీ 11 బంతుల్లో 16 పరుగులు రాబట్టాడు. చివరకు 6 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

ధోనీ లేట్ బ్యాటింగ్‌కు కారణం చెప్పిన కోచ్

ధోనీపై వస్తోన్న విమర్శలకు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ధోనీ మోకాలి గాయం కారణంగా 10 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసే పరిస్థితిలో లేడని ఫ్లెమింగ్ చెప్పాడు. అందుకే సిచ్వేషన్‌ను బట్టి ధోనీ బ్యాటింగ్‌కు వస్తాడని చెప్పి విమర్శకుల నోరు మూయించే ప్రయత్నం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories