
SA vs AFG: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయం!
SA vs AFG: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో సంచలన విజయం నమోదైంది.
భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో సంచలన విజయం నమోదైంది. నరేంద్ర మోడీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ నిర్ణీత 20 ఓవర్లలో 187/6 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి మూడు బంతుల్లో రెండు రన్స్ చేయాల్సి ఉండగా.. నాలుగో బంతికి రెండో రన్ కోసం ప్రయత్నించి ఫారూఖీ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
మొదట సూపర్ ఓవర్‌లో అఫ్గానిస్థాన్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా 17 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా మొదటి ఐదు బంతుల్లో ఒక వికెట్ కోల్పోయి... 11 రన్స్ చేసింది. చివరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్ సిక్స్ బాదడంతో స్కోర్స్ లెవల్ అయి.. మరో సూపర్ ఓవర్ తప్పనిసరి అయింది. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా వికెట్ కోల్పోకుండా 23 రన్స్ చేసింది. డేవిడ్ మిల్లర్ రెండు సిక్స్‌లు, ట్రిస్టన్ స్టబ్స్ ఒక సిక్స్ బాదాడు. ఛేదనలో అఫ్గాన్ 19/2కు పరిమితమై.. ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి రెండు బంతుల్లో అఫ్గాన్ పరుగులేమీ చేయకుండానే వికెట్ కోల్పోవడం దెబ్బ పడింది. రహ్మనుల్లా గుర్బాజ్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదగా.. ఒక వైడ్ రావడంతో అఫ్గాన్ విజయ సమీకరణం ఒక బంతికి ఐదు పరుగులుగా మారింది. ఆఖరి బంతికి గుర్బాజ్ క్యాచ్ అవుట్ అవడంతో అఫ్గాన్ ఆశలు ఆవిరయ్యాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత సఫారీలు బ్యాటింగ్ చేయగా.. ర్యాన్ రికెల్‌టన్ (61; 28 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (59; 41 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు బాదారు. డెవాల్డ్ బ్రెవిస్ (23; 19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా.. డేవిడ్ మిల్లర్ (20), మార్కో యాన్సెన్ (16) కీలక పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ఒమర్జాయ్ 3, రషీద్ ఖాన్ 2 వికెట్స్ తీశారు. 188 పరుగుల ఛేదనలో అఫ్గాన్ 19.4 ఓవర్లలో 187 రన్స్‌కు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (84; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒమర్జాయ్ (22), రషీద్ ఖాన్ (20), దర్విష్ (15), ఇబ్రహీం జద్రాన్ (12) కీలక పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో నూర్ అహ్మద్ (15) రెండు సిక్స్‌లతో మెరుపులు మెరిపించినా అఫ్గాన్ స్వయం తప్పిదంతో ఓటమిని చూడాల్సి వచ్చింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




