SMAT 2025: 99 బంతుల్లో మ్యాచ్ ఫినిష్.. 11 సిక్సర్లు, 16 ఫోర్లతో విధ్వంసం.. ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్ మెరుపులు

SMAT 2025: 99 బంతుల్లో మ్యాచ్ ఫినిష్.. 11 సిక్సర్లు, 16 ఫోర్లతో విధ్వంసం.. ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్ మెరుపులు
x

SMAT 2025: 99 బంతుల్లో మ్యాచ్ ఫినిష్.. 11 సిక్సర్లు, 16 ఫోర్లతో విధ్వంసం.. ఓపెనర్‌గా అర్జున్ టెండూల్కర్ మెరుపులు

Highlights

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఈసారి బ్యాటర్ల విధ్వంసం మాములుగా లేదు. ముఖ్యంగా కేరళ జట్టులోని ఇద్దరు ఓపెనర్లు.. ఒడిశా బౌలింగ్‌పై చేసిన దాడిని చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

SMAT 2025: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో ఈసారి బ్యాటర్ల విధ్వంసం మాములుగా లేదు. ముఖ్యంగా కేరళ జట్టులోని ఇద్దరు ఓపెనర్లు.. ఒడిశా బౌలింగ్‌పై చేసిన దాడిని చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కెప్టెన్ సంజు శాంసన్, రోహన్ కున్నుమ్మల్ కలిసి 16.3 ఓవర్లలోనే 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఒడిశా బౌలర్లను కన్నీళ్లు పెట్టించారు. మరోవైపు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగి బ్యాట్‌తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో ఒడిశా జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేరళ జట్టు తరఫున రోహన్ కున్నుమ్మల్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 60 బంతుల్లో 121 పరుగులు (నాటౌట్) చేసి అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 201.67 కాగా, కేవలం సిక్సర్లు, ఫోర్ల రూపంలోనే రోహన్ 100 పరుగులు రాబట్టాడు. కెప్టెన్ సంజు శాంసన్ 51 పరుగులతో (నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. ఈ జోడీ కలిసి 16 ఫోర్లు, 11 సిక్సర్లు బాది, 16.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. కేరళ జట్టు ఈ మ్యాచ్‌ను ఏకంగా 99 బంతులు మిగిలి ఉండగానే గెలుచుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది.

మరో మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గోవా జట్టు తరఫున ఆడిన అర్జున్ టెండూల్కర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. యూపీ (ఉత్తరప్రదేశ్) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గోవా 172 పరుగులు చేసింది. అర్జున్ తన తొలి ఓపెనింగ్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్‌ వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని, 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అతను అభినవ్ తేజరానాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, 173 పరుగుల లక్ష్యాన్ని యూపీ జట్టు వికెట్ కీపర్ ఆర్యన్ జుయల్ ( 57 బంతుల్లో 93 పరుగులు, నాటౌట్), సమీర్ రిజ్వీ ( 38 పరుగులు) ధాటికి 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అలాగే, గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ బాది, T20 క్రికెట్‌లో తన పేరిట ఉన్న రెండో వేగవంతమైన సెంచరీ రికార్డును మరోసారి చూపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories