Sanju Samson: సంజు శాంసన్ చరిత్ర.. టీ20 వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డు!

Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్‌ ఒకే ఎడిషన్‌లో సెమీ ఫైనల్, ఫైనల్‌లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులో నిలిచాడు.

Rishvik
Published on: 8 March 2026 8:25 PM IST
Sanju Samson
X

Sanju Samson: సంజు శాంసన్ చరిత్ర.. టీ20 వరల్డ్ కప్‌లో అరుదైన రికార్డు!

Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్‌ ఒకే ఎడిషన్‌లో సెమీ ఫైనల్, ఫైనల్‌లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో సంజు హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనతను కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే సాధించారు. ఇప్పుడు ఆ జాబితాలో భారత స్టార్ ఆటగాడు సంజుకు కూడా చోటు సంపాదించాడు.

తొలిసారి షాహిద్ ఆఫ్రిది:

ఈ అరుదైన రికార్డును తొలిసారి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అందుకున్నాడు. 2009 టీ20 వరల్డ్ కప్‌లోని సెమీ ఫైనల్, ఫైనల్‌లో ఆఫ్రిది అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఆఫ్రిది కీలక ఇన్నింగ్స్‌లతో పాకిస్తాన్ ఆ ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.

2014లో విరాట్ కోహ్లీ మెరుపులు:

షాహిద్ ఆఫ్రిది తర్వాత ఈ ఘనతను భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుకున్నాడు. 2014 టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించి అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఫైనల్‌లో భారత్ ఓడిపోవడంతో కోహ్లీ ప్రదర్శన వృధా అయింది.

2026లో సంజు సూపర్ రికార్డు:

2026 టీ20 వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ కూడా ఈ ఘనత సాధించి చరిత్రలో నిలిచాడు. సెమీఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన సంజు.. ఫైనల్‌లో కూడా హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. దీంతో టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్‌లో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ అరుదైన రికార్డు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు మాత్రమే సాధించే ఈ ఘనతను మనోళ్లు ఇద్దరు అందుకోవడం భారత అభిమానులకు గర్వకారణంగా మారింది.

Rishvik

Rishvik

Next Story