Musheer Khan : సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు సంచలనం.. ఇంగ్లాండ్ పర్యటనలో హ్యాట్రిక్ సెంచరీలు, 16 వికెట్లు!

Musheer Khan
x

Musheer Khan : సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు సంచలనం.. ఇంగ్లాండ్ పర్యటనలో హ్యాట్రిక్ సెంచరీలు, 16 వికెట్లు!

Highlights

Musheer Khan : ముంబైకి చెందిన యువ క్రికెటర్, భారత టెస్ట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ ఇంగ్లాండ్ పర్యటనలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

Musheer Khan : ముంబైకి చెందిన యువ క్రికెటర్, భారత టెస్ట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ ఇంగ్లాండ్ పర్యటనలో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ముంబై ఎమర్జింగ్ టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న ముషీర్, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కూడా సెంచరీలు చేసి అదరగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో 125 పరుగులు, రెండో మ్యాచ్‌లో 123 పరుగులు చేసిన ముషీర్, ఇప్పుడు మూడో మ్యాచ్‌లో అజేయంగా 154 పరుగులు చేసి హ్యాట్రిక్ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ముషీర్, బౌలింగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ మొదటి రెండు మ్యాచ్‌లలోనే 16 వికెట్లు పడగొట్టాడు.

ముషీర్ తన ఇంగ్లాండ్ పర్యటనలో నాట్స్ సెకండ్ ఎలెవన్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 123 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఛాలెంజర్స్ తో జరిగిన రెండో మ్యాచ్‌లో 125 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఏకంగా 10 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు లౌబరో యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ క్రికెటింగ్ ఎక్సలెన్స్ తో జరిగిన మూడో మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు సాధించాడు.

లౌబరో యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ క్రికెటింగ్ ఎక్సలెన్స్ తో జరిగిన మూడో మ్యాచ్‌లో ముంబై ఎమర్జింగ్ ప్లేయర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ అజేయంగా 154 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యాంశు షెడ్జే 108 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో వేదాంత్ ముఖర్జీ 3, మనన్ భట్ 0, హర్ష్ 64 పరుగులు చేశారు. దీంతో 52 ఓవర్ల ముగిసే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది.

ఈ పర్యటనలో ముషీర్ కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. నాట్స్ సెకండ్ ఎలెవన్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన ముషీర్, ఛాలెంజర్స్ తో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు లౌబరో ఎక్సలెన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎన్ని వికెట్లు తీస్తాడో చూడాలి. అయితే, మొదటి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories