IND vs SL ODI: శ్రీలంక సిరీస్‌లో భారత యువజట్టు శుభారంభం

IND vs SL ODI: తొలివన్డేలో 7 వికెట్ల తేడాతో ధావన్‌ టీమ్‌ విజయం 36.4 ఓవర్లలో 263 పరుగుల లక్ష్యం ఛేదించిన టీమిండియా

Sandeep Eggoju
Updated on: 19 July 2021 11:20 AM IST
Shikhar Dhawan Team Won the First ODI by 7 Wickets
X

శ్రీలంకపై విజయ సాధించిన టీం ఇండియా ధావన్ టీం (ఫైల్ ఇమేజ్)

IND vs SL ODI: భారత యువజట్టు శ్రీలంక సిరీస్‌లో శుభారంభం ఇచ్చింది. శిఖర్ దావన్ కెప్టెన్సీలో శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో కుర్రాళ్లు అదరగొట్టారు. దీంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్.. పృథ్వీషా, ఇసాన్ కిషన్‌లు విజృంభించడంతో శ్రీలంక విధించిన 263 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. నాటౌట్‌గా నిలిచిన ధావన్‌ 86 పరుగులు చేయగా షా 24 బంతుల్లో 43, ఇషాన్ కిషన్ 42 బంతుల్లో 59 రన్స్ చేశారు.అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. 43 రన్స్ చేసిన కరుణరత్నె లంక టీమ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధసున్ శనక 39, అసలంక 38 పరుగులు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story