Shubman Gill : శుభమన్ గిల్ విషయంలో అదే జరిగింది..గౌహతి టెస్ట్‌కు కెప్టెన్ ఔట్

Shubman Gill : శుభమన్ గిల్ విషయంలో అదే జరిగింది..గౌహతి టెస్ట్‌కు కెప్టెన్ ఔట్
x

Shubman Gill : శుభమన్ గిల్ విషయంలో అదే జరిగింది..గౌహతి టెస్ట్‌కు కెప్టెన్ ఔట్

Highlights

భారత్, సౌతాఫ్రికా మధ్య నవంబర్ 22 నుంచి గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కి ముందు అనుమానించినట్లుగానే జరిగింది.

Shubman Gill : భారత్, సౌతాఫ్రికా మధ్య నవంబర్ 22 నుంచి గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కి ముందు అనుమానించినట్లుగానే జరిగింది. టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం దాదాపు ఖాయమైంది. మెడ కండరాల నొప్పితో బాధపడుతున్న గిల్, ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పగ్గాలు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చేతికి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు కూడా వన్డే కెప్టెన్ అయిన గిల్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. శుభమన్ గిల్ ఇంకా మెడ నొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదు. నవంబర్ 19, బుధవారం అతను జట్టుతో కలిసి గౌహతి వెళ్లినప్పటికీ, రెండో టెస్ట్ మ్యాచ్‌కి అందుబాటులో ఉండటం కష్టం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గిల్ గైర్హాజరీలో, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కోల్‌కతా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా పంత్ కెప్టెన్సీ చేశాడు. ఒక టెస్ట్ మ్యాచ్ మొత్తానికి పంత్ కెప్టెన్సీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది.

కోల్‌కతా టెస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత బ్యాటింగ్ సమయంలో గిల్‌కు గాయమైంది. క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో అతని మెడ కండరాలు పట్టేశాయి. దీంతో నొప్పి తీవ్రమవడంతో అతను కేవలం 3 బంతులు ఆడి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. అదే రోజు సాయంత్రం గిల్‌ను కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్చారు. ఒక రోజు తర్వాత డిశ్చార్జ్ అయినప్పటికీ, మెడ నొప్పి కారణంగా అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ చేయలేదు. ఆ టెస్ట్ మ్యాచ్‌ను టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.

శుభమన్ గిల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, నొప్పి పెరిగే అవకాశం ఉన్నా కూడా అతన్ని కోల్‌కతా నుంచి గౌహతికి తీసుకెళ్లడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డాక్టర్లు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రయాణం చేయకూడదని సూచించినప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ ఎందుకు రిస్క్ తీసుకుంది? ఈ నిర్ణయంపై జట్టు మేనేజ్‌మెంట్, బీసీసీఐ పెద్ద విమర్శలు ఎదుర్కొంటున్నాయి. మెడకు సంబంధించిన గాయం చాలా సున్నితమైనది. ఈ రిస్క్ వల్ల గిల్ గాయం మరింత పెరిగితే, వన్డే సిరీస్‌కు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు కూడా అతను దూరం కావాల్సి వస్తుంది. ఇది టీమిండియా మొత్తం ప్రణాళికను దెబ్బతీసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories