Mohammed Siraj : సిరాజ్ ఈజ్ బ్యాక్..హైదరాబాద్ జట్టులో నయా జోష్

Mohammed Siraj : సిరాజ్ ఈజ్ బ్యాక్..హైదరాబాద్ జట్టులో నయా జోష్
x

Mohammed Siraj : సిరాజ్ ఈజ్ బ్యాక్..హైదరాబాద్ జట్టులో నయా జోష్

Highlights

టీమిండియా స్పీడ్ గన్, హైదరాబాద్ నవాబ్ మహమ్మద్ సిరాజ్ అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది.

Mohammed Siraj : టీమిండియా స్పీడ్ గన్, హైదరాబాద్ నవాబ్ మహమ్మద్ సిరాజ్ అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది. గత కొంతకాలంగా భారత వన్డే జట్టుకు దూరంగా ఉంటున్న సిరాజ్, ఇప్పుడు మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీనికి వేదికగా విజయ్ హజారే ట్రోఫీ నిలుస్తోంది. హైదరాబాద్ జట్టులో సిరాజ్ చేరడంతో అతని వన్డే రీఎంట్రీ దాదాపు ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ జట్టును ప్రకటించారు. ఇందులో మహమ్మద్ సిరాజ్ పేరు ఉండటం విశేషం. చండీగఢ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాకుండా, జనవరి 8న జమ్మూ కాశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అతను ఆడే అవకాశం ఉంది. ఇలా వరుసగా రెండు దేశవాళీ వన్డే మ్యాచ్‌లు ఆడటం చూస్తుంటే, కివీస్‌తో జరగబోయే తదుపరి వన్డే సిరీస్ కోసం సిరాజ్ తన ఫిట్‌నెస్‌ను, లయను నిరూపించుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని వచ్చిన తిలక్ వర్మ తిరిగి హైదరాబాద్ జట్టు పగ్గాలు చేపట్టాడు. అతని గైర్హాజరీలో జట్టును నడిపించిన సి.వి.మిలింద్ నుంచి తిలక్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు. సిరాజ్, తిలక్ వర్మ ఇద్దరూ జట్టులో ఉండటంతో హైదరాబాద్ బలం రెట్టింపు అయింది. ముఖ్యంగా సిరాజ్ లాంటి అనుభవం ఉన్న బౌలర్ పవర్‌ప్లేలో వికెట్లు తీస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు. గత ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డే తర్వాత సిరాజ్ మళ్ళీ వన్డేలు ఆడలేదు, కాబట్టి ఈ టోర్నీ అతనికి చాలా కీలకం.

విజయ్ హజారే ట్రోఫీలో కేవలం సిరాజ్, తిలక్ మాత్రమే కాదు.. టీమిండియా ఇతర స్టార్లు కూడా సత్తా చాటబోతున్నారు. టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శుభ్‌మన్ గిల్, పంజాబ్ తరపున సిక్కింతో జరిగే మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. తన బ్యాటింగ్‌తో సెలక్టర్లకు సమాధానం చెప్పాలని గిల్ పట్టుదలతో ఉన్నాడు. అటు తమిళనాడు జట్టు నుంచి వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి కూడా బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ దేశవాళీ టోర్నీ కాస్తా మినీ టీమిండియా సమరంలా మారిపోయింది.

మహమ్మద్ సిరాజ్ వన్డే రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం 46 ఇన్నింగ్స్‌ల్లోనే 73 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆసియా కప్‌లో శ్రీలంకపై 21 పరుగులకే 6 వికెట్లు తీసిన ఆ స్పెల్ ఎవరూ మర్చిపోలేరు. వన్డే ఫార్మాట్‌లో పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో సిరాజ్ దిట్ట. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ, దక్షిణాఫ్రికా సిరీస్‌లో చోటు దక్కకపోవడం అతని అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు మళ్ళీ తన మార్క్ బౌలింగ్‌తో సెలక్టర్ల తలుపు తట్టేందుకు సిరాజ్ సిద్ధమయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories