Sourav Ganguly: ముంబై హైకోర్టును ఆశ్రయించిన సౌరవ్ గంగూలీ

Sourav Ganguly Files Petition in Baombay High Court
x

BCCI President Sourav Ganguly:(The Hans India)

Highlights

Sourav Ganguly: గతంలో అర్భిట్రేషనల్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టు ను ఆశ్రయించారు.

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కారణం గతంలో తన క్రీడా వ్యవహారాలను పర్యవేక్షించిన రెండు సంస్థల నుండి తనకు రావాల్సిన రూ.35 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని, గతంలో అర్భిట్రేషనల్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని ఆ దేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ముంబై హైకోర్టు ను ఆశ్రయించారు. ఆ సమయంలో గంగూలీ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గతంలో పర్సెప్ట్ టాలెంట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, పర్సెప్ట్ డి మార్క్(ఇండియా) లిమిటెడ్ అనే రెండు సంస్థలకు గంగూలీకి మేనేజర్లుగా వ్యవహించాయి. ఈ మేరకు ఆ సంస్థలతో గంగూలీకి ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ కేసు పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ గంగూలీకి రూ.14,40,91,000 చెల్లించాలని దానితో పాటు ఆ మొత్తానికి ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ కూడా కలిపి చెల్లించాలని ఆ రెండు సంస్థలను ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలుకు గంగూలీ కోల్ కత్తా కోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని తేల్చింది. దీంతో చేసేది ఏమి లేక గంగూలీ ముంబై హైకోర్టును ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories