South Africa ICC Semi Finals Stats: ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా చిత్తు.. వెంటాడుతోన్న ‘చోకర్స్’ ముద్ర!

South Africa ICC Semi Finals Stats: ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా చిత్తు.. వెంటాడుతోన్న ‘చోకర్స్’ ముద్ర!
x

South Africa ICC Semi Finals Stats: ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా చిత్తు.. వెంటాడుతోన్న ‘చోకర్స్’ ముద్ర!

Highlights

South Africa ICC Semi Finals Stats: ఐసీసీ సెమీఫైనల్స్‌లో మళ్లీ విఫలం.. కీలక మ్యాచ్‌ల్లో తడబడిన దక్షిణాఫ్రికా, ‘చోకర్స్’ ట్యాగ్ మరింత బలపడింది!

South Africa ICC Semi Finals Stats: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతిభావంతులైన జట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. సఫారీ జట్టులో ఎంతోమంది స్టార్స్ ఉన్నా.. ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ గెలవలేదు. ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లలో వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ‘చోకర్స్’ అనే ముద్రను తెచ్చుకుంది. పెద్ద టోర్నీల్లో విఫలమయ్యే జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. టీ20 వరల్డ్ కప్‌ 2026లో బుధవారం మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను దక్షిణాఫ్రికా ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్ చరిత్రను పరిశీలిస్తే.. సఫారీ జట్టుకు చేదు అనుభవాలే ఎక్కువగా కనిపిస్తాయి.

1992 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ ప్రయాణం ముగిసింది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై గెలిచి ఒకసారి విజయం సాధించినా.. 1999 వరల్డ్‌కప్ సెమీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ టై కావడం, పాయింట్ల పట్టికలో వెనుకబడటం వల్ల ఫైనల్‌కు దూరమైంది. ఆ మ్యాచ్ ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరిత పోరుగా గుర్తించబడుతోంది. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటములను ఎదుర్కొంది. 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో సఫారీలపై వెస్టిండీస్ విజయం అందుకుంది.

2007 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం చవిచూసింది. 2009 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్, 2014 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ముందు సఫారీలు నిలువలేకపోయారు. 2015 వన్డే వరల్డ్‌కప్ సెమీలో న్యూజిలాండ్ చేతిలో హృదయ విదారక ఓటమిని ఎదుర్కొంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం దక్షిణాఫ్రికా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

2024 టీ20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించడం సఫారీ జట్టుకు ఊరటనిచ్చింది. అయితే ఫైనల్లో మాత్రం భారత్ చేతిలో పరాజయం పాలైంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో మళ్లీ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఐసీసీ సెమీఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా మొత్తం 14 సార్లు ఆడగా.. కేవలం రెండు విజయాలే సాధించింది. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వారి బలహీనతగా మారింది. ప్రతిభ, సమర్థత ఉన్నప్పటికీ సెమీఫైనల్ దశలో దక్షిణాఫ్రికా జట్టు తడబడం ప్రధాన సమస్యగా మారింది. భవిష్యత్తులో ఈ ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకుని ఐసీసీ ట్రోఫీ గెలుస్తారా? అన్నది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories